
రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ఇప్పుడు యుద్ధంగా మారింది. నివేదికల ప్రకారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా మొత్తం 11 నగరాలపై రష్యా దాడులు చేసింది. ఈ యుద్ధం మనల్ని కొత్త ప్రపంచ యుద్దం వైపు తీసుకెళ్తోందని పలువురు నిపుణులు అంటున్నారు. దీని వల్ల ప్రపంచం చాలా ప్రమాదకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి రావచ్చు. నేటి ప్రపంచంలో ప్రతి దేశం ఇతర దేశాలతో పరస్పరం అనుసంధానించి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈ యుద్ధం భారతదేశంపై చాలా ప్రభావం చూపుతుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారతదేశ రాజకీయ, స్ట్రాటిజిక్, ఆర్థిక పరిస్థితిని పెద్దగా ప్రభావితం చేయబోతోంది. ఈ సమయంలో భారత్ ఇరు దేశాల మధ్యలో ఇరుక్కుపోయిందని పలువురు నిపుణులు అంటున్నారు. యూరప్ లేదా రష్యాతో కలిసి వెళ్లడం సరైనదా అని నిర్ణయించుకోవడం భారత్ కి చాలా కష్టంగా మారింది. రానున్న కాలంలో ఈ యుద్ధం మరింత పెద్దగా రూపు దాల్చితే.. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశ ద్రవ్యోల్బణంపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..?
భారతదేశం ఉక్రెయిన్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌కు భారతదేశం 15వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్. మరోవైపు ఉక్రెయిన్ భారతదేశానికి 23వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఇలాంటి పరిస్థితిలో ఈ యుద్ధం రెండు దేశాల వ్యాపార ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.
ఉక్రెయిన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇవేకాకుండా ఇనుము, ఉక్కు, ప్లాస్టిక్, ఇన్ ఆర్గానిక్ కెమికల్స్ మొదలైన ఎన్నో వస్తువులను ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటుంది. మరోవైపు, ఉక్రెయిన్ కాకుండా భారతదేశం ఎన్నో యూరోపియన్ దేశాలకు మందులు, బాయిలర్ మెషినరి, మెకానికల్ అప్లియన్సెస్ మొదలైనవాటిని ఎగుమతి చేస్తుంది.
ఈ యుద్ధం కారణంగా రెండు దేశాల మధ్య దిగుమతి-ఎగుమతులు నిలిచిపోనున్నాయి, దీని వల్ల దేశ ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఈ యుద్ధం కారణంగా రానున్న కాలంలో ఎన్నో నిత్యావసర వస్తువుల ధరలు పెరగవచ్చు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున వంటనూనెను దిగుమతి చేసుకుంటోంది. ఈ యుద్ధం కారణంగా భారత్ ఇకపై ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకోలేకపోవచ్చు. ఈ పరిస్థితిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి కోసం భారత ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయా దేశాల కోసం వెతుకుతోంది. అయితే, ఆ దేశాలు అంత త్వరగా దిగుమతులకు మారడం అంత సులభం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో వంటనూనె ధరలు పెరిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ సప్లయ్ చైన్ ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ తర్వాత ప్రపంచ సరఫరా చైన్ ఇప్పుడు దానికి సమానంగా తీవ్రంగా ప్రభావితంకానుంది. అయితే, కరోనా వ్యాధి వ్యాప్తి తగ్గిన తర్వాత ఇందులో కొంత మెరుగుదల కనిపించింది. అలాగే ఈ యుద్ధం మళ్లీ ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం కలిగించబోతోంది. దీని వల్ల ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
రానున్న కాలంలో ఈ యుద్ధం మరింత ముదిరితే ముడిచమురు ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా దేశ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగవచ్చు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తత, ముడి చమురు ధరల పెరుగుదల దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదంగా ఉందని అన్నారు. ఇంధన ధరలు నేరుగా వినియోగాన్ని దెబ్బతీస్తాయని అంచనా వేసింది, ఇది ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రభావితమైంది. ప్రభుత్వ అంచనాలు 2021-22లో ప్రైవేట్ ఫైనల్ వినియోగ వ్యయం (PFCE) రూ. 80.81 లక్షల కోట్లుగా అంచనా వేసింది, 2019-20లో రూ. 83.22 లక్షల కోట్లుగా ఉంది.
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో ఏడు నెలల గరిష్ఠ స్థాయి 6.01 శాతానికి చేరుకుంది. జనవరిలో హోల్ సెల్ ధరల ద్రవ్యోల్బణం నెల క్రితం 13.56 శాతం నుంచి 12.96 శాతానికి తగ్గినప్పటికీ, రెండంకెలలో ఉండడం వరుసగా పదో నెల.