Russia Ukraine Crisis: యుద్ధ ప్ర‌భావం.. 14 ఏళ్ల గరిష్టానికి గోధుమ ధరలు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 06, 2022, 12:30 PM ISTUpdated : Mar 06, 2022, 12:32 PM IST
Russia Ukraine Crisis: యుద్ధ ప్ర‌భావం.. 14 ఏళ్ల గరిష్టానికి గోధుమ ధరలు..!

సారాంశం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోధుమ ధరలు పద్నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో సరఫరా కొరత భయాలతో 2008 తర్వాత మొదటిసారి భారీగా పెరిగాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోధుమ ధరలు పద్నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో సరఫరా కొరత భయాలతో 2008 తర్వాత మొదటిసారి భారీగా పెరిగాయి. ఉక్రెయిన్ నుండి ప్రపంచంలోని వివిధ దేశాలకు 25 శాతం గోధుమలు ఎగుమతి అవుతాయి. బ్రెడ్ నుండి కుకీస్, నూడుల్స్ వరకు ప్రతి దానిలో ఉపయోగించే ప్రధాన ఆహారం గోధుమలు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ఉక్రెయిన్ పైన రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ దేశాలు మాస్కో పైన భారీ ఆంక్షలు విధించాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రధాన నౌకాశ్రయాలను నిలిపివేసింది. లాజిస్టిక్స్, రవాణా సంబంధాలు తెగిపోయాయి. యుద్ధం వల్ల రానున్న రోజుల్లో గోధుమ పంట పండే అవకాశాలు కూడా సన్నగిల్లాయి.

ధరలు పెరుగుద‌ల‌

రష్యా, ఉక్రెయిన్ దేశాలు వివిధ దేశాలకు పెద్ద ఎత్తున మొక్కజొన్న, బార్లీ, సన్ ఫ్లవర్ ఆయిల్‌ను సరఫరా చేస్తాయి. 2012 నుండి మొక్కజొన్న ధరలు ఇప్పుడు అత్యధికంగా పెరిగింది. సోయాబీన్ ఆయిల్, పామాయిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కజొన్న, సోయాబీన్ దిగుమతిదారు చైనా. అలాగే, గోధుమలను కొనుగోలు చేసే దేశం కూడా చైనా. ఈ దేశం తమకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవడం కోసం పావులు కదుపుతోంది. ఇది ధరలను మరింత పెరగడానికి కారణమవుతోంది.

పద్నాలుగేళ్ల గరిష్టానికి 

సరఫరా భయాలు మరింతగా పెరగడంతో గోధుమలు తాజాగా పద్నాలుగేళ్ల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం చికాగోలో గోధుమ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ పరిమితితో 6.6 శాతం పెరిగి 12.09 డాలర్లకు చేరుకుంది. ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఆహార ద్రవ్యోల్భణంపై ఒత్తిడి పెంచడం, యుద్ధం, ఆంక్షలు వంటి వివిధ అంశాల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలం ప్రభావం చూపకుండా రేట్లను ఎంత వరకు పెంచవచ్చుననే అంశంపై సెంట్రల్ బ్యాంకులు గందరగోళంలో పడ్డాయి.

అప్పుడు మరింత పెరగవచ్చు 

బ్లాక్ సీ ఎగుమతులు లాక్ చేయబడితే అత్యంత బుల్ దృష్టాంతంలో ధరలు 14 డాలర్లు లేదా 14.50 డాలర్లకు పెరగవచ్చునని సిటీ గ్రూప్ ఇంక్ పేర్కొంది. చికాగో ఫ్యూచర్ మే 2020 నుండి అత్యధిక స్థాయికి చేరుకోవడంతో బియ్యం కూడా గందరగోళంగా ఉంది. ఎక్కువగా దిగుమతులు చేసుకునే దేశాలకు ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. చైనీస్ కొనుగోలుదారులు ఇటీవల అమెరికా సోయాబీన్ 20 కార్గోలు, దాదాపు 10 మొక్కజొన్న సరుకులను బుక్ చేశారు కార్న్ ఫ్యూచర్స్ ఈ వారం 17 శాతం పెరిగింది. 2008 నుండి ఇదే అతిపెద్ద వారపు లాభం. ప్రపంచంలోని అగ్రశ్రేణి గోధుమ ఎగుమతిదారుల్లో అర్జెంటీనా ఉంది.

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?