Rupee Falls at 80: మరింత బలం పుంజుకున్న డాలర్, చరిత్రలోనే తొలిసారి రూ. 80 పడిపోయిన రూపీ విలువ..

Published : Jul 19, 2022, 09:44 AM ISTUpdated : Jul 19, 2022, 10:31 AM IST
Rupee Falls at 80: మరింత బలం పుంజుకున్న డాలర్, చరిత్రలోనే తొలిసారి రూ. 80 పడిపోయిన రూపీ విలువ..

సారాంశం

మంగళవారం తొలిసారిగా డాలర్‌కు రూపాయి రూ. 80 స్థాయికి పతనం అయ్యింది. 

రూపాయి మొదటిసారిగా డాలర్‌కు ప్రతిగా 80 రూపాయల స్థాయికి పడిపోయింది. జూలై 19 మంగళవారం నాడు ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది.  రూపాయి గత కొన్ని రోజులుగా  క్రమంగా క్షీణిస్తోంది, ఈ నేపథ్యంలో రూపాయి విలువ 80 డాలర్లు దాటుతుందనే భయం ఇప్పుడు నిజమైంది. క్రితం సెషన్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.79.97 వద్ద ముగిసింది. గత సెషన్ తో పోల్చి చూస్తే, ఈ రోజు ఇది రూపాయికి డాలర్ కు ప్రతిగా 79.98 ధర వద్ద ప్రారంభమై.రూ.80 స్థాయికి పడిపోయింది.

రూపాయి డాలర్ కు ప్రతిగా తన చారిత్రక గరిష్ట స్థాయి అయిన 80.05 స్థాయిని తాకింది.   ఇదిలా ఉంటే US డాలర్ గత వారంలో కనిష్ట స్థాయి బలపడుతోంది. 

మునుపటి సెషన్ గురించి మాట్లాడినట్లయితే, ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో US కరెన్సీతో రూపాయి సోమవారం 16 పైసలు క్షీణించి 79.98 ముగిసింది. ట్రేడింగ్ సమయంలో, ఇది స్వల్ప కాలానికి డాలర్‌కు రూ. 80 వద్ద ట్రేడయ్యింి. ముడిచమురు ధరలు పెరగడం, మార్కెట్‌ నుంచి విదేశీ మూలధన ప్రవాహం కొనసాగడమే రూపాయి పతనానికి కారణమని నిపుణులు తెలిపారు.

శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పెరిగి రూ.79.82 వద్ద ముగిసింది. స్వల్పకాలంలో డాలర్-రూపాయి స్పాట్ ధర 79.79 మరియు 80.20 రేంజ్‌లో ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

డిసెంబర్ 2014 నుండి రూపాయి 25 శాతం పడిపోయింది
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో, ఆర్‌బిఐ డేటా ప్రకారం, డిసెంబర్ 31, 2014 నాటి రేటుతో పోలిస్తే రూపాయి 25 శాతం పడిపోయిందని చెప్పారు. డిసెంబర్ 31, 2014న డాలర్‌తో రూపాయి 63.33గా ఉంది, ఇది జూలై 11, 2022న డాలర్‌కు రూ.79.41గా నమోదైంది. ఇది దాదాపు 25 శాతం వరకు పతనమైంది. 

రష్యా-ఉక్రెయిన్ వివాదం, ముడిచమురు ధరలు పెరగడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఒత్తిడి వంటి అనేక గ్లోబల్ కారకాలు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి క్షీణతకు కారణమని మంత్రి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు
Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే