ఆడపిల్లలకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్ ! తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే!

By Ashok kumar Sandra  |  First Published Apr 15, 2024, 4:35 PM IST

మీరు 25 ఏళ్ల పాలసీ తీసుకుని, అన్యువల్  ప్రీమియం రూ.41,367 చెల్లిస్తే, ప్రతినెలా  ప్రీమియం మొత్తం రూ.3,447 అవుతుంది. ఈ పాలసీ ద్వారా పన్ను ప్రయోజనాలను పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి.
 


ప్రభుత్వ రంగ బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసి అనేక రకాల పాలసీలను అందిస్తోంది. వీరిలో ఆడపిల్లల ప్రయోజనాల కోసం ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని అందిస్తోంది. ఈ పథకంలో మీరు ఒక సంవత్సరం వయస్సు నుండి ఆడపిల్ల పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పాలసీ వ్యవధి 13 నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రతినెలా, 3నెలలు, 6 నెలలు, సంవత్సర ప్రీమియం చెల్లించే సౌకర్యం కూడా ఉంది. మీరు 25 ఏళ్ల పాలసీని ఎంచుకుంటే, మీరు 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం 25 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే అమ్మాయి తండ్రి వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

Latest Videos

పాలసీ తీసుకున్న 3వ సంవత్సరం నుంచి లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. మీరు 2 సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయాలనుకుంటే, ఆ సౌకర్యం కూడా ఉంటుంది. ఒక నెల ప్రీమియం చెల్లించకపోతే జరిమానా లేకుండా నెక్స్ట్  30 రోజులలోపు ప్రీమియం చెల్లించవచ్చు.

ఈ పాలసీ ద్వారా పన్ను ప్రయోజనాలను పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి. సెక్షన్ 80C, సెక్షన్ 10D కింద పన్ను మినహాయింపు ఇవ్వబడింది. హామీ మొత్తం కనిష్టంగా రూ. 1 లక్ష నుండి ప్రారంభమవుతుంది. గరిష్ట పరిమితి లేదు.

మీరు 25 ఏళ్ల పాలసీ తీసుకుని సంవత్సర  ప్రీమియం రూ.41,367 చెల్లిస్తే, ప్రతినెల ప్రీమియం మొత్తం రూ.3,447 అవుతుంది. ఇలా 22 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత రూ.22.5 లక్షల లైఫ్  ఇన్సూరెన్స్   డబ్బు లభిస్తుంది.

పాలసీ తీసుకునేటప్పుడు అమ్మాయి తండ్రి చనిపోతే అతని భార్య తదుపరి టర్మ్‌కు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మాఫీ చేయబడుతుంది. ఇది కాకుండా 25 ఏళ్లు అలాగే  25 సంవత్సరాల మెచ్యూరిటీ మొత్తం వరకు ఏటా రూ.1 లక్ష చెల్లించబడుతుంది. అమ్మాయి తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే నామినీకి ప్రమాద మరణ( accidental death ) ప్రయోజనం రూ.10 లక్షలు చెల్లిస్తారు. 

click me!