ముకేష్‌కు జియోతో నెల రోజుల్లో రూ.40 వేల కోట్లు

By narsimha lodeFirst Published Oct 13, 2019, 1:53 PM IST
Highlights

రిలయన్స్ జియో ద్వారా ముఖేష్ అంబానీ ఆదాయం మరింత పెరుగుతోంది. నెల రోజుల్లోనే జియో ద్వారా ముఖేష్ అంబానీ మరింత ఆదాయాన్ని పొందుతున్నాడు. 

న్యూఢిల్లీ: సంపదకు సంబంధించి ఏ లిస్ట్‌‌లో చూసినా ముందుండేది బిలీనియర్ ముఖేష్ అంబానీనే. ఆయన సంపద కోట్లకు కోట్లు పెరగడమే కానీ, తరగడం లేదు. నిన్న కాక మొన్న విడుదలైన ఫోర్బ్స్ లిస్ట్‌‌లోనూ మరోసారి ముకేశ్ అంబానీనే టాప్‌‌లో నిలిచారు. 

గత నెలలో ముకేశ్ అంబానీ సంపద ఏకంగా రూ.40 వేల కోట్లు పెరిగి రూ.4.2 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదంతా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర దూసుకు పోవడమేనని తెలిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గతనెలలో 9.6 శాతం పెరిగాయి. 

దీంతో ఇండియా మోస్ట్ వాల్యుడ్ కంపెనీగా రిలయన్స్ టాప్‌‌లో నిలిచింది. అంబానీనే కాక, ఆయన సారధ్యంలోని రిలయన్స్ కంపెనీ కూడా టాప్‌‌లోనే నిలవడం విశేషం. మోస్ట్ వాల్యుడ్‌‌ కంపెనీగా కాంపిటీటర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)‌‌, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ ఒకదానికొకటి పోటీ పడుతూ టాప్‌‌లో నిలుస్తూ ఉంటాయి. 

కానీ ఈ సారి టీసీఎస్‌‌ను మించి పోయి రిలయన్స్‌‌ చాలా ముందుకు వెళ్లింది.  రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ.8.57 లక్షల కోట్లకు ఎగిసింది. ఇదే రోజు టీసీఎస్‌‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.46 లక్షల కోట్ల వద్దే నిలిచింది. 

ఇరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో వ్యత్యాసం రూ.1.11 లక్షల కోట్లుగా ఉంది. గత రెండు లేదా మూడు వారాల నుంచి ఈ గ్యాపే ఉంటోంది. ఎందుకంటే రిలయన్స్ షేర్లు బాగా ర్యాలీ చేస్తుండగా.. టీసీఎస్‌‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

రిలయన్స్ షేర్ ధర గత నెలలో 9.6 శాతం పెరిగి రూ.1,352.40కు చేరుకుంది. టీసీఎస్ షేర్ ధర 7.75 శాతం తగ్గి రూ.1,987.05కు పడిపోయింది. రిలయన్స్ షేర్లు పెరగడానికి ప్రధాన కారణం  జియో స్ట్రాంగ్ పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌ నమోదు చేయడమే. రిలయన్స్ జియో దాని ప్రత్యర్థులు ఎయిర్‌‌‌‌టెల్, వొడాఫోన్ ఐడియాలతో పోలిస్తే మెరుగైన మార్జిన్లను రాబట్టుకుంటోంది. 

యాక్సిస్ క్యాపిటల్‌‌ అంచనాల ప్రకారం జియో ఆపరేటింగ్ ఇన్‌‌కమ్ రెండో క్వార్టర్‌‌‌‌లో 5.2 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈబీఐటీడీఏ మార్జిన్ మాత్రం 40.2 శాతంగానే ఉంటుందని తెలిసింది. మరోవైపు గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు మాత్రం రిలయన్స్‌‌కు తగ్గిపోతున్నాయి.

click me!