రికార్డు స్థాయికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేర్లు..క్యూ1 ఫలితాలు జూలై 31కు వాయిదా

By Sandra Ashok KumarFirst Published Jul 22, 2020, 6:07 PM IST
Highlights

ఈ రోజు ఇంట్రా-డే ట్రేడ్‌లో ఆర్‌ఐఎల్ 1.4 శాతం పెరిగి తాజా రికార్డు స్థాయిలో రూ .2,000 మార్కును తాకింది. ఎస్ అండ్ పి బిఎస్ఇ 500 ఇండెక్స్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ముథూట్ ఫైనాన్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జెకె సిమెంట్స్, లారస్ ల్యాబ్స్,  డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు మంగళవారం బిఎస్ఇలో తాజా రికార్డు స్థాయిని తాకింది. 

ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్) షేరు బుధవారం రూ.2000 మార్కును తాకింది. ఈ రోజు ఇంట్రా-డే ట్రేడ్‌లో ఆర్‌ఐఎల్ 1.4 శాతం పెరిగి తాజా రికార్డు స్థాయిలో రూ .2,000 మార్కును తాకింది. ఎస్ అండ్ పి బిఎస్ఇ 500 ఇండెక్స్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ముథూట్ ఫైనాన్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జెకె సిమెంట్స్, లారస్ ల్యాబ్స్,  డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు మంగళవారం బిఎస్ఇలో తాజా రికార్డు స్థాయిని తాకింది.

ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ ఉదయం 10:45 గంటలకు 37,932 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా  ట్రేడ్ అయ్యింది. బెంచ్ మార్క్ ఇండెక్స్లో 21 శాతం పెరుగుదలతో పోలిస్తే గత మూడు నెలల్లో ఈ స్టాక్ 48 శాతం ర్యాలీ చేసింది.

2020 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 21) కంపెనీ ఆడిట్ ఆర్థిక ఫలితాలను జూలై 24నుంచి జూలై 30కు వాయిదా వేస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీంతో రియలన్స్‌ క్యూ1 గణాంకాలు జూలై 30వ తేదిన వెల్లడి కానున్నాయి.

also read కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త ఎం.డి & సిఇఒగా రమేష్ బాబు ...

ముథూట్ ఫైనాన్స్ వరుసగా ఐదవ రోజు 5 శాతం పెరిగి 1,293 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 5 శాతం పెరుగుదలకు వ్యతిరేకంగా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ స్టాక్ గత వారంలో 20 శాతం పెరిగింది.

స్టాక్ స్ప్లిట్ ప్రతిపాదన  లాభాలు, నష్టాలు గురించి బోర్డు చర్చించినట్లు కంపెనీ తెలిపింది. కోవిడ్ -19 వ్యాప్తి, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా ఆర్థిక అనిశ్చితులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనను వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నారు.

గ్రాన్యూల్స్ ఇండియా కూడా 276 రూపాయల గరిష్టాన్ని తాకింది. ఈ రోజు ఇంట్రా-డేలో 5 శాతం లాభపడింది. కొత్త ఉత్పత్తి లాంచ్‌, ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల, ఉత్పత్తుల మార్కెట్ వాటా పెరగడం ప్రధాన వృద్ధికి కారణమని కంపెనీ తెలిపింది.

ఈ త్రైమాసికంలో  గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్ ఇంక్ (జిపిఐ) ద్వారా కొల్చిసిన్ టాబ్లెట్లు, బుటల్‌బిటల్ ఎపిఎపి కెఫిన్ టాబ్లెట్లను విడుదల చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్  టార్గెట్ ధరను అంతకుముందు రూ .245 నుండి రూ .340 కు సవరించింది.  
 

click me!