‘డ్యూక్స్’ ఆధ్వర్యంలో నేడు ఘనంగా వాఫీ హ్యప్పీ డే..

Ashok Kumar   | Asianet News
Published : Jul 03, 2021, 04:07 PM ISTUpdated : Jul 03, 2021, 04:08 PM IST
‘డ్యూక్స్’ ఆధ్వర్యంలో నేడు  ఘనంగా వాఫీ హ్యప్పీ డే..

సారాంశం

విశిష్టమైన రుచులతో  ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్న డ్యూక్స్ బ్రాండ్  నేడు జూన్ 3న వాఫీ డేని జరుపుకుంటోంది. 

హైదరాబాద్, జూలై 03, 2021: రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌పీఎల్) ఆధ్వర్యంలో డ్యూక్స్ బ్రాండ్ పేరుతో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల అభిరుచులకు అనుగుణంగా రుచికరమైన బేకరీ ఉత్పత్తులను అందిస్తోంది. విశిష్టమైన రుచులతో  ప్రజల ఆదరాభిమానాలను కూడా అందుకుంటోంది. డ్యూక్స్ బ్రాండ్ గుర్తింపు తీసుకొచ్చిన ఉత్పత్తుల్లో వాఫీ కూడా ఒకటి.

1999 జూలై 3వ తేదీన డ్యూక్స్ బ్రాండ్ బిస్కట్స్.. మొదటిసారిగా వాఫీని మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బేకరీ ఉత్పత్తుల ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న వాఫీ అందుబాటులోకి వచ్చిన రోజును ‘వాఫీ డే’గా జరుపుకుంటున్నాం. డ్యూక్స్ వాఫీ 9 రకాల రుచుల్లో చక్కటి, సౌకర్యవంతమైన ప్యాకింగ్‌లలో లభిస్తోంది.

also read ప్రియాంక చోప్రా నుండి విరాట్ కోహ్లీ వరకు ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నుండి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

అందుకే క్రీమ్‌తో నిండిన ఈ వాఫీలు చిరువేడుకల్లో, ప్రయాణాల్లో ఇలా ప్రతి సందర్భంలోనూ తమకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాయి. లోపల చక్కటి రుచికరమైన క్రీమ్‌, బయట కరకరలాడే తేలికైన బిస్కట్‌తో కూడిన వాఫీలు తింటూ ‘ఆహా’ అనని వారెవరైనా ఉంటారా! అందుకే.. వాఫీని రుచిచూడటం ద్వారా కలిగే ఆహ్లాదాన్ని, ఆనందం, ఆ వేడుకను మరోసారి గుర్తుచేయడానికే డ్యూక్స్ కంపెనీ జూన్ 3న వాఫీ డేని జరుపుకుంటోంది. 

వాఫీ డేని పురస్కరించుకుని డ్యూక్స్ బ్రాండ్.. వాఫీ రుచులను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను చేపట్టింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలతోపాటు ఆన్‌లైన్, రేడియో కార్యక్రమాల ద్వారా వాఫీ గురించిన  ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం బిగ్ ఎఫ్ఎం రేడియోలో ‘వాఫీకీ ఖుషీ’ పాటను కూడా విడుదల చేసింది.

PREV
click me!

Recommended Stories

Cheapest EV bike: చవక ధరకే ఏథర్ ఈవీ బైక్.. ఇలా అయితే ఓలాకు కష్టమే
Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి