కరోనాపై పోరుకు రిలయన్స్‌ సైతం.. ముంబైలో ఆసుపత్రి సిద్దం

By narsimha lodeFirst Published Mar 24, 2020, 10:31 AM IST
Highlights

దేశంలో అతిపెద్ద వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ముందుకు వచ్చింది. దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి తనవంతుగా చేయూతనందించడంలో భాగంగా మాస్క్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు లక్షకు పెంచాలని నిర్ణయించింది.

ముంబై: దేశంలో అతిపెద్ద వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ముందుకు వచ్చింది. దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి తనవంతుగా చేయూతనందించడంలో భాగంగా మాస్క్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు లక్షకు పెంచాలని నిర్ణయించింది.  
కోవిడ్-19 పేషంట్లను తరలించేందుకు వాడే అత్యవసర వాహనాలకు ఉచితంగా ఇంధనం సరఫరా చేస్తామని రిలయన్స్ ప్రకటించింది. ఇక లాక్ డౌన్ వల్ల జీవనాధారం కోల్పేయే వారికి ఆయా నగరాల్లో ఉన్న ఎన్‌జీవోలతో కలిసి ఉచితంగా భోజనం కూడా అందిస్తున్నది. 

అలాగే సామాజిక సేవల్లో భాగంగా ముంబైలో 100 పడకల ఆసుపత్రిని సైతం ఏర్పాటు చేసింది. రిలయన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగం ఆధ్వర్యంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందించడానికి రెండు వారాల్లోనే ఈ ఆసుపత్రిని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)తో కలిసి శ్రీ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ నెలకొల్పింది. 

ఈ దవాఖానలో అన్ని రకాల పడకల వద్ద బయోమెడికల్‌ పరికరాలు, వెంటిలేటర్లు, పేస్‌మేకర్లు, డయాల్‌సిస్‌ మెషిన్లు, పేటెంట్‌ మానిటరింగ్‌ పరికరాలను రిలయన్స్ అందుబాటులో ఉంచింది. వైరస్‌ నేపథ్యంలో మూతపడిన కంపెనీకి సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలు యథావిధిగా చెల్లించనున్నట్లు రిలయన్స్ తెలిపింది.

దేశవ్యాప్తంగా ఉన్న 746 గ్రాసరీ స్టోర్లలో అన్ని రకాల వస్తువులను సిద్ధంగా ఉంచామని రిలయన్స్ వెల్లడించింది. తమ స్టోర్లు ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు వెల్లడించింది. 

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం జరిపేందుకు వ్యాపారవేత్తలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇంతకుముందే మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా కోవిడ్-19 రోగుల కోసం వెంటిలేటర్ల తయారీ చేపడుతున్నామని ప్రకటించారు. 

Also read:రూపాయి బేల చూపులు.. డాలర్ @ రూ.76.15

బాధితులకు అండగా నిలుస్తామని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3.80 లక్షలు దాటగా, దేశంలో 499 కేసులు నమోదయ్యాయి.

ఇక రిలయన్స్ జియో నూతన బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. పాత వినియోగదారులకు డాటా పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేసేవారికి ప్రయోజనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్‌ కనెక్షన్‌ పొందడానికి రూ.2,500 చెల్లించాల్సి ఉండగా, వీటిలో రూ.1,500 రిఫండ్‌ కింద పొందనున్నారు. 

click me!