పండుగ సీజన్ కోసం రిలయన్స్ జ్యువల్స్ కొత్త కలెక్షన్స్.. మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ డిస్కౌంట్ కూడా..

Ashok Kumar   | Asianet News
Published : Oct 21, 2020, 10:26 PM IST
పండుగ సీజన్ కోసం రిలయన్స్ జ్యువల్స్ కొత్త కలెక్షన్స్.. మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ డిస్కౌంట్ కూడా..

సారాంశం

భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువల్స్ అద్భుతమైన ఆభరణాల కలెక్షన్స్ ఉత్కాలాను ప్రారంభించింది. ఈ కలెక్షన్స్ ‘ఒడిశా’  సాంస్కృతిక సాంప్రదాయాల నుండి ప్రేరణ పొందింది.  

పండుగ సీజన్ ప్రారంభానికి గుర్తుగా భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువల్స్ అద్భుతమైన ఆభరణాల కలెక్షన్స్ ఉత్కాలాను ప్రారంభించింది. ఈ కలెక్షన్స్ ‘ఒడిశా’  సాంస్కృతిక సాంప్రదాయాల నుండి ప్రేరణ పొందింది.  

ఈ అద్భుతమైన కలెక్షన్స్ లో అత్యంత అందమైన డిజైన్లు ఉన్నాయి, ఇక్కడ కొనుగోలుదారులు వివిధ రకాల డిజైన్, కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలను ఎంచుకోవచ్చు.

సున్నితమైన కళాత్మకత అనేది కోణార్క్ ఆలయ శిల్పకళ, ముక్తేశ్వర్ ఆలయ శిల్పకళ, పూరి జగన్నాథ్ ఆలయ శిల్పకళ, సీంతి నృత్య శిల్పకళ, అన్యదేశ చిత్ర కళల నుండి ప్రేరణ పొందింది.

రిలయన్స్ జ్యుయల్స్  ఉత్కల కలెక్షన్స్ -

చోకర్ సెట్ల నుండి చిన్న నెక్లెస్, పొడవైన పరిపూర్ణమైన సొగసైన నెక్లెస్ సెట్ల వరకు కలెక్షన్స్ ఉన్నాయి, ఇవి వివిధ సందర్భాలు, బడ్జెట్ ధరకు అనుగుణంగా మీకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంటాయి.  18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన డైమండ్ సెట్లు మీ పండుగ మరియు సమకాలీన రూపాలకు ఖచ్చితంగా సరిపోతాయి.

also read ప్రపంచ చరిత్రలోనే అత్యంత ధనవంతుడు.. అంబానీ ఆస్తికి మించిన డబ్బును విరాళంగా ఇచ్చేవాడట.. ...

ఈ ప్రత్యేక కలెక్షన్స్ ఆభరణాల ప్రారంభోత్సవం గురించి రిలయన్స్ జ్యువల్స్ ప్రతినిధి మాట్లాడుతూ, “భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ధంతెరస్ సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదంగా పరిగణిస్తారు.

మా డిజైన్ వారసత్వాన్ని కొనసాగించడానికి, అద్భుతంగా తయారుచేసి జోడించిన అందమైన కలెక్షన్స్ ఉత్కలాను అందిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రతి బంగారు, వజ్రాల హారము, చెవిపోగుల సెట్ ఎంతో ప్రత్యేకమైనది.

శుభప్రదమైన పండుగ ధంతెరస్ కు ముందు ఈ కలెక్షన్స్  అందించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది, మా వినియోగదారులు మరింత అందంగా కనబడటానికి మేము ఎదురుచూస్తున్నాము. ” అని అన్నారు.
 
ఉత్కల కలెక్షన్‌లో సెట్ చేసిన ప్రతి ఆభరణాలు చక్కటి హస్తకళకు, రిలయన్స్ జ్యువెల్స్‌ బ్రాండ్ నాణ్యత, నమ్మకానికి గుర్తు. ఉత్కల కలెక్షన్‌ అక్టోబర్ 17 నుండి భారతదేశంలోని రిలయన్స్ జ్యువల్స్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయి.

అలాగే, బంగారు ఆభరణాలు & బంగారు నాణేల తయారీ ఛార్జీల మీద ఫ్లాట్ 30% తగ్గింపు, డైమండ్ జ్యువెలరీ ఇన్వాయిస్ విలువపై 30% తగ్గింపు అందిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్, 16 నవంబర్ 2020 వరకు వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. షరతులు వర్తిస్తాయి.

PREV
click me!

Recommended Stories

Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు
Amazon Jobs : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు... అమెజాన్ లో 10 లక్షల జాబ్స్..!