రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చేతికి మరో చారిత్రక ఐకానిక్ బ్రిటిష్ కంపెనీ..

By S Ashok KumarFirst Published Apr 23, 2021, 7:30 PM IST
Highlights

 ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్‌కు చెందిన స్టోక్ పార్కును 79 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. హోటల్‌తో పాటు గోల్ఫ్‌ కోర్స్‌ కలిగి ఉన్న స్టోక్‌ పార్క్‌ను అంబానీ  సొంతం చేసుకున్నారు.

ఆసియా అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్‌కు చెందిన స్టోక్ పార్కును 79 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. హోటల్‌తో పాటు గోల్ఫ్‌ కోర్స్‌ కలిగి ఉన్న స్టోక్‌ పార్క్‌ను  ముకేష్ అంబానీ సొంతం చేసుకున్నారు.

దీని విలువ 79 మిలియన్ డాలర్లు అంటే ఇండియా ప్రకారం రూ .592 కోట్లు. ఈ స్టోక్ పార్క్ యూ.‌కేలో రెండవ తరం బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన మొదటి కంట్రీ క్లబ్. 

అంతేకాదు స్టోక్ పార్క్‌లో రెండు జేమ్స్ బాండ్ సినిమాలు కూడా చిత్రీకరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ పర్యాటక వ్యాపారానికి ఈ స్టోక్ పార్క్ ఒక ముఖ్యమైనదిగా ఉంటుంది. ఇందులో హోటల్, ఇతర వినోద వేదికలు ఉన్నాయి.

1964లో జేమ్స్ బాండ్ గోల్డ్ ఫింగర్‌ చిత్రం షూటింగ్ లో ఉన్నపుడు ఈ  స్టోక్ పార్క్‌లోనే గోల్ఫ్ ఆడాడు. 300 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్కులో గ్రెగోరియన్ కాలం నాటి ప్యాలెస్ కూడా ఉంది. పాపులర్ మూవీ 'బ్రిడ్జేట్ జోన్స్ డైరీ', నెట్‌ఫ్లిక్స్  'ది క్రౌన్' వెబ్ సిరీస్ కూడా ఇక్కడే చిత్రీకరించారు.

also read స్వల్పంగా దిగోస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు 24క్యారెట్ల పసిడి ధర ఎంతంటే ? ...

ఈ పార్కులో 49 లగ్జరీ బెడ్ రూములు, సూట్లు, ఛాంపియన్‌షిప్ గోల్ఫ్ కోర్సు, 13 టెన్నిస్ కోర్టులు, 14 ఎకరాల ప్రైవేట్ గార్డెన్ ఉన్నాయి. ఈ స్టోక్ పార్క్ ప్రపంచంలోని అత్యంత ధనిక ప్రదేశాలలో ఒకటి. అంబానీ కుటుంబం కూడా ఈ పార్కును చాలాసార్లు సందర్శించింది.  

బ్రిటిష్ చిత్ర పరిశ్రమలో  స్టోక్ పార్క్ కి ప్రముఖ స్థానం ఉంది. జేమ్స్ బాండ్ చిత్రాలు గోల్డ్ ఫింగర్ (1964), టుమారో నెవర్ డైస్ (1997) స్టాక్‌హోమ్ పార్క్‌లో చిత్రీకరించారు. స్టోక్ పార్కుకు కనీసం 900 సంవత్సరాలు. 1908 వరకు, ఈ ఉద్యానవనం ఒక ఇంటి స్థలానికి ఆనుకొని ఉన్న ఆస్తి.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం, ముకేష్ అంబానీ నికర విలువ  81.5 బిలియన్లు అంటే సుమారు ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు. ఈ వారసత్వ ప్రదేశంలో క్రీడలు, వినోద సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామని రిలయన్స్ తెలిపింది.

జూలై నుండి సెప్టెంబర్ 2019 వరకు రిలయన్స్‌కు 11 వేల 262 కోట్ల లాభం ఆర్జించింది. అంతే కాదు 2019లో  రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం ఆదాయం 1 లక్ష 53 వేల 374 కోట్లు. 2020లో  కరోనా కారణంగా 1 లక్ష 17 వేల 195 కోట్లకు పడిపోయింది.

కరోనా సంక్రమణ కారణంగా 20 ఏళ్ళలో కంపెనీ లాభాల లోటు ఏర్పడిందని కంపెనీ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన తెలిపింది. అయితే ఆదాయపు పన్ను, వడ్డీ, ఇతర పన్నులను మినహాయించి, కంపెనీ లాభం ఈ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగి 23,299 కోట్ల రూపాయలకు చేరుకుంది. స్టాక్ పార్క్ ఇప్పుడు రిలయన్స్ వినియోగదారుల, ఆతిథ్య వ్యాపారాలలో భాగంగా ఉంటుంది. 
 

click me!