స్వల్పంగా దిగోస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు 24క్యారెట్ల పసిడి ధర ఎంతంటే ?

By S Ashok KumarFirst Published Apr 23, 2021, 6:32 PM IST
Highlights

నేడు స్వల్ప స్థాయిలో బంగారం ధరలు తగ్గాయి.  హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. నేడు ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 నుంచి రూ.44,800కు తగ్గింది.
 

బంగారు ఆభరణాలు కొనేవారికి ఈ పెళ్లీల సీజన్ లో శుభవార్త. నేడు స్వల్ప స్థాయిలో  24 క్యారెట్ల బంగారం ధర తగ్గి రూ.47, 615కు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు రూ.648 తగ్గి రూ.69,673 నుంచి రూ.69,075కు చేరుకుంది.

 ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం నేడు బులియన్ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47615, 22 క్యారెట్ల బంగారం ధర  రూ.43790కు పడిపోయింది.

18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ .35855 వద్ద ఉంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ధరలు మీ నగరం ధరలతో 500 నుండి 1000 రూపాయల మధ్య మారవచ్చని తెలిపింది.

also read 

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పడిపోయి   ఔన్స్‌కు 1,784 డాలర్లకు, వెండికి ఔన్సు 26.05 డాలర్లకు చేరుకుంది.

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ మాట్లాడుతూ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న కమోడిక్స్ ఎక్స్ఛేంజ్ కామెక్స్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. నేడు ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 నుంచి రూ.44,800కు తగ్గింది.

click me!