తిరుమలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. దేవస్థానాలకు భారీ విరాళం..

By asianet news teluguFirst Published Sep 16, 2022, 2:28 PM IST
Highlights

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముకేష్ అంబానీకి వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.  ఆలయానికి చేరుకున్న ముకేష్ అంబానీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లోని  తిరుమల వేంకటేశ్వర స్వామిని  దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమలకు చేరుకున్న ముకేష్ అంబానీ అభిషేకం సేవలో పాల్గొన్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముకేష్ అంబానీకి వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.  ఆలయానికి చేరుకున్న ముకేష్ అంబానీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని  తిరుమల వెంకటేశ్వర ఆలయంతో పాటు ఆలయాలను నిర్వహించే స్వతంత్ర ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు రూ. 1.5 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను ముకేష్ అంబానీ తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.

ముకేష్ అంబానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేసి, ఆపై తిరుమలలోని ఎస్వీ గోశాలను సందర్శించారు. ఈ పర్యటనలో ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యుడు సీ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ముకేష్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని, వేంకటేశ్వర స్వామి అందరినీ ఆశీర్వదించాలని  ప్రార్థిస్తున్నానని ముకేష్ అంబానీ అన్నారు. 

సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు జరగనున్న తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా ముకేష్ అంబానీ వేంకటేశ్వర స్వామిని  దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  

 

తిరుమలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. దేవస్థానాలకు భారీ విరాళం.. pic.twitter.com/t0If2Goi06

— Asianetnews Telugu (@AsianetNewsTL)
click me!