ఈ- కామర్స్ సంస్థలపై కొరడా, ఇక పై సేల్స్ పెంచేందుకు నకిలీ రివ్యూలను పోస్ట్ చేస్తే జరిమానా తప్పదు..

By Krishna AdithyaFirst Published Sep 16, 2022, 9:35 AM IST
Highlights

ఈ కామర్స్ సైట్లపై కేంద్ర ప్రభుత్వం మరో సారి కొరడా ఝళిపించనుంది. తమ ప్రాడక్టులను విక్రయించేందుకు ఇష్టం వచ్చినట్లు రివ్యూలను పోస్టు చేస్తే చర్యలు తప్పవని  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హెచ్చరించింది. అంతేకాదు ఆ మేరకు కొత్త నిబంధనలు కూడా రూపొందిస్తోంది. 

ఈ కామర్స్ సైట్లలో అత్యధిక మంది తాము కొనే వస్తువు నాణ్యతను, అలాగే దాని మన్నికను తెలుసుకునేందుకు ఆ ప్రాడక్టు కింద ఉన్న రివ్యూలను చదువుతారు. ఇందులో చాలా మంది వినియోగగారులు తమ అనుభవాలను రివ్యూ రూపంలో పోస్టు చేస్తారు. అయితే కొన్ని ఈ కామర్స్ సైట్లు తమ ప్రాడక్టులను అమ్మేందుకు ఫేక్ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో కస్టమర్లు మోసపోయే ప్రమాదం ఉంది. 

త్వరలో ఇ-కామర్స్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం నకిలీ రివ్యూలను పోస్ట్ చేస్తే భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ మేరకు  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలు రూపొందిస్తోంది. 

అందుతున్న వార్తల ప్రకారం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) 2021లో రూపొందించిన నకిలీ రివ్యూలకు సంబంధించిన నిబంధనలలో మార్పులను వినియోగదారుల వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఖరారు చేస్తోంది.

సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ ప్రారంభం కానుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ లో సైతం బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో  ఈ నిబంధనలలో మార్పులు చేసిన తర్వాత, ఈ కామర్స్ సైట్లు తప్పనిసరిగా  నకిలీ రివ్యూలను పోస్ట్ చేసినందుకు  ఇ-కామర్స్ సంస్థలపై జరిమానా విధించబడుతుంది. నకిలీ రివ్యూలపై BIS నిబంధనలు, ప్రస్తుతానికి స్వచ్చందంగా ఉన్నాయి.

వినియోగదారుల రక్షణ చట్టం, 2019 నిబంధనల ప్రకారం, ఉత్పత్తులపై నకిలీ రివ్యూలను పోస్ట్ చేసినందుకు, 5 స్టార్ రేటింగ్‌ లను ఇచ్చినందుకు ఇ-కామర్స్ సంస్థలపై జరిమానా విధించబడుతుంది. ఈ పెనాల్టీ మొత్తం రూ. 10 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఉండవచ్చు. ఇది కాకుండా, వినియోగదారుల వ్యవహారాల శాఖ తప్పు చేసిన ఇ-కామర్స్ సంస్థలపై కూడా సుమోటో కింద కాగ్నిజెన్స్ తీసుకోవచ్చని వర్గాలు తెలిపాయి.

నకిలీ సమీక్షలపై బీఐఎస్ నిబంధనలలో మార్పులను వారంలోగా కమిటీ సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై బుధవారం ప్యానెల్ సమావేశం నిర్వహించగా, ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు భాగస్వాములు పాల్గొన్నారు.

click me!