ఆఫర్లే ఆపర్లు: ఫైబర్ నెట్‌వర్క్‌లోకి రిలయన్స్

First Published Jul 5, 2018, 5:04 PM IST
Highlights

జాతీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన కార్పొరేట్ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’. మొబైల్ టెలిఫోన్ రంగంలో ‘జియో’తో సంచలన విజయాలు సాధించి టెలికం రంగాన్నే శాసించిన ఘనత గల రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అడుగు ముందుకేయనున్నది. 

ముంబై: జాతీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన కార్పొరేట్ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’. మొబైల్ టెలిఫోన్ రంగంలో ‘జియో’తో సంచలన విజయాలు సాధించి టెలికం రంగాన్నే శాసించిన ఘనత గల రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అడుగు ముందుకేయనున్నది. అంతా ఊహించినట్లే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ టెలికం, బ్రాడ్ బాండ్ పరిశ్రమపై పట్టు సాధించతలపెట్టినట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1,100 నగరాల పరిధిలో రిలయన్స్ జియో గిగా ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ప్రకటించారు. రిలయన్స్ 41వ వార్షిక సమావేశంలో తన నిర్ణయాన్ని ముఖేశ్ అంబానీ వెల్లడించారు. గత వార్షిక సమావేశంలో రూ.0 విలువైన ఫోన్ ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. 

ఫిక్స్‌డ్ లైన్ల జియో గిగా ఫైబర్ నెట్ వర్క్ సేవలందించనున్నట్లు ప్రకటించారు. అంతే కాదు ఆగస్టు 15వ తేదీన జియో గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామన్నారు. ఈ రిజిస్ట్రేషన్లు మై జియో, జియో డాట్ కామ్ లో అందుబాటులో ఉన్నాయి. 

ఫైబర్ కనెక్టివిటి ఇండ్లకు, వ్యాపారులకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అతిపెద్ద సంస్థలకు అందుబాటులోకి రానున్నదని ప్రకటించారు. జియో గిగా ఫైబర్ ఇక హోం సొల్యూషన్ ఆప్షన్లు అందుబాటులోకి తెస్తుందని ముఖేశ్ అంబానీ చెప్పారు. అంతటితో ఆగలేదు. రిలయన్స్ అప్ గ్రేడెడ్ వర్షన్ జియో ఫోన్ -2 నూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 15వ తేదీ నుంచి జియో ఫోన్లలో యూ ట్యూబ్, ఫేస్ బుక్, వాట్సప్ వంటి సౌకర్యాలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక మాన్సూన్ హంగామా ఆఫర్ కింద ఎక్స్చేంజ్ ఫీచర్ ఫోన్లకు రూ.501తో జియో ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. భారత్ - ఇండియా జొడో ఇన్సియేటివ్ ద్వారా రిలయన్స్.. డిజిటల్ అండ్ ఫిజికల్ మార్కెట్లను సంఘటితం చేయనున్నదని ముఖేశ్ అంబానీ ప్రకటించారు. రిటైల్, హెల్త్ కేర్, వ్యవసాయం, విద్యారంగాల్లోకి రంగ ప్రవేశం చేస్తామన్నారు. ఇంధన రంగంలో సంస్కరణలు తెస్తామన్నారు. 

కార్పొరేట్ రంగంలో అత్యధిక జీఎస్టీ, ఆదాయం పన్ను చెల్లించిన ఘనత తమదేనని సగర్వంగా ప్రకటించారు ముఖేశ్ అంబానీ. రిలయన్స్ లాభాలు 20.8 శాతం పెరిగి రూ.36,075 కోట్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే జియో యూజర్లు రెట్టింపయ్యారు. జియో ఫోన్ వినియోగదారుల సంఖ్య 25 మిలియన్లను దాటిపోయిందని తెలిపారు. గత 12 నెలల్లో రిలయన్స్ రూ.28,900 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నదని మీడియా ఒక వార్తాకథనం ప్రచురించింది. త్వరలో ఈ - కామర్స్ రంగంలోనూ అడుగు పెట్టనున్నదని ప్రముఖ అధ్యయన సంస్థ ‘సీఎల్ఎస్ఏ’ అంచనా వేసింది. 
 

click me!