రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం: ఇండియాలోకి చైనా బ్యాంకులు

First Published Jul 4, 2018, 6:13 PM IST
Highlights

భారత్‌లోకి మరో చైనా బ్యాంక్ రానుంది. ఇప్పటికే ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్‌కు తోడుగా బ్యాంక్ ఆఫ్ చైనా మనదేశంలో సేవలు అందించడానికి ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఇప్పటికే తన వస్తువులతో భారతీయ మార్కెట్‌ను ముంచెత్తుతోంది చైనా.. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటబొమ్మలు, ఫైర్ వర్క్స్ ‌తదితర వస్తువులతో చైనా భారతీయులను తన వైపుకు తిప్పుకుంది. తాజాగా భారత బ్యాంకింగ్ రంగంలోనూ అడుగుపెట్టింది. కొద్దిరోజుల క్రితం చైనా వెళ్లిన ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌‌తో జరిపిన  చర్చల సందర్భంగా చైనా బ్యాంక్ అంశం చర్చకు వచ్చింది.

భారత్‌లో చైనా బ్యాంకులు ప్రవేశించేందుకు అనుమతినిస్తామని ఆయన మోడీ, జిన్‌పింగ్‌కు హామీ ఇచ్చారు. దీని ప్రకారం ‘ ది ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసిబిసి)’ని ఇండియాలోకి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ మంజూరు చేసింది. ఇక తాజాగా చైనా ప్రభుత్వ రంగ దిగ్గజం ‘బ్యాంక్ ఆఫ్ చైనా‌’ కూడా ఇండియాలో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చింది. ఇప్పటికే భారత్‌లో విదేశాలకు చెందిన 45 బ్యాంకులు భారతీయులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి.

click me!