Assam floods: అస్సాం సిఎం రిలీఫ్ ఫండ్‌కు 25 కోట్లను అందించిన రిలయన్స్ ఫౌండేషన్..

By asianet news teluguFirst Published Jun 25, 2022, 3:12 PM IST
Highlights

అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సొసైటీ సంస్థలతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ దాదాపుగా నెలరోజుల పాటు చేసిన విరాళాలను  సి‌ఎం రిలీఫ్ ఫండ్‌కు అందించింది.
 

గౌహతి (అస్సాం) జూన్ 25 : అస్సాం రాష్ట్రాన్ని వరదలు తీవ్రంగా ప్రభావితం చేయడంతో అస్సాం ప్రజలను ఆదుకోవడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం రూ. 25 కోట్లను అందించింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోషల్ మీడియాలో  కృతజ్ఞతలు తెలుపుతూ, “ఈ కీలక సమయంలో అస్సాం ప్రజలకు అండగా నిలిచినందుకు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకు నా కృతజ్ఞతలు.  ఇది మా వరద సహాయక చర్యలను పెంపొందించడంలో చాలా దోహదపడుతుంది” అని అన్నారు.

అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సొసైటీ సంస్థలతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ దాదాపుగా నెలరోజుల పాటు చేసిన విరాళాలను  సి‌ఎం రిలీఫ్ ఫండ్‌కు అందించింది.

వరద పరిస్థితిపై వేగంగా స్పందిస్తూ, రంగంలో ఉన్న బృందంతో రిలయన్స్ ఫౌండేషన్ అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్, పశుసంవర్ధక ఇంకా పశువైద్య శాఖ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇతర సివిల్ సొసైటీ  సంస్థలతో వరదల వల్ల కలిగే ప్రభావాలను తగ్గించడానికి, ఉపశమనాన్ని అందించడానికి చేతులు కలిపింది. 

కాచార్ జిల్లాలో రిలయన్స్ ఫౌండేషన్ సిల్చార్, కలైన్, బోర్ఖోలా అండ్ కటిగోర్ బ్లాక్‌లలో తక్షణ సహాయక చర్యలకు సహకరిస్తోంద అలాగే నాగావ్ జిల్లాలోని కతియాటోలి, రాహా, నాగావ్ సదర్ అండ్ కంపూర్ బ్లాక్‌లలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వైద్య శిబిరాలు నిర్వహించి అత్యవసర సహాయ కిట్లను పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో వారాల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తర్వాత ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్న కాచర్, నాగావ్ జిల్లాల్లో  ఎన్నో పశువుల శిబిరాలు కూడా నిర్వహించారు.

జూన్ 1న శిబిరాలు ప్రారంభమైనప్పటి నుండి వరదల కారణంగా ఉత్పన్నమయ్యే వివిధ ఆరోగ్య పరిస్థితుల కోసం 1,900 మందికి పైగా ప్రజలు పరీక్షించారు, చికిత్స అందించారు. పశువుల శిబిరాల్లో 10,400 కంటే ఎక్కువ జంతువులు చికిత్స పొందాయి.

వైద్య శిబిరాలతో పాటు, రిలయన్స్ ఫౌండేషన్ గృహా స్థాయిలో  తక్షణ ఉపశమనం అందించడానికి డ్రై రేషన్, పరిశుభ్రత అవసరాలతో రిలీఫ్ కిట్‌లను పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు 5,000 కుటుంబాలకు కిట్లు అందించారు.

2021లో రిలయన్స్ ఫౌండేషన్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఎనిమిది విపత్తులు, ప్రధానంగా తుఫానులు, వరదల వల్ల ప్రభావితమైన వివిధ రాష్ట్రాల్లో సహాయక చర్యలకు రిలయన్స్ ఫౌండేషన్ మద్దతు ఇచ్చింది, రిలీఫ్‌తో పాటు విపత్తుకు ముందు, తరువాత సలహాలు గత సంవత్సరంలో 1.7 లక్షల మందికి చేరాయి.

click me!