Reliance demerger: నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీస్ షేర్ల విభజన, కొత్త షేర్ల ధర ఎంతంటే

By Krishna Adithya  |  First Published Jul 20, 2023, 3:14 PM IST

ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డీమర్జర్ ద్వారా విభజన జరిగింది.  జూలై 20, గురువారం ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ నిర్వహించగా, దీనిలో రిలయన్స్ షేర్ యొక్క సర్దుబాటు ధర నిర్ణయించారు. దీంతో పాటు, జియో ఫైనాన్షియల్ షేర్ రేటు కూడా నిర్ణయించారు. విభజన తర్వాత రిలయన్స్ షేర్ హోల్డఱ్లు ఎన్ని జియో ఫైనాన్షియల్ షేర్లను  పొందుతారు. వాటి ధర ఎలా నిర్ణయిస్తారు లాంటి ముఖ్యమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. 


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారం 'స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్' జూలై 20న విడిపోయింది. డీమర్జర్  తర్వాత, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ పేరు 'జియో ఫైనాన్షియల్ సర్వీసెస్' (JFSL) గా మార్చారు. రిలయన్స్ కొత్త కంపెనీ.డీమర్జర్ కోసం, ఈ రోజు ఉదయం 9 నుండి 10 గంటల వరకు ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ జరిగింది. దీనిలో కొత్త కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ ధర రూ. 261.85గా నిర్ణయించారు. డీ మర్జర్ తర్వాత ఈ సెషన్‌లో, RIL కొత్త స్టాక్ ధర రూ.2,580గా నిర్ణయించారు. 

ఇదిలా ఉంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ సూచికలలో త్వరలోనే భాగం కాబోతోంది. జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ తేదీ ఇంకా నిర్ణయించబడలేదు. ఇది 1 నుండి 2 నెలల్లో లిస్టింగ్ అవుతుందని భావిస్తున్నారు. బ్రోకరేజ్ నివేదిక ప్రకారం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విలువ రూ. 1.52 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. డీమర్జర్ తో భారతదేశంలో 8వ అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా అవతరిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ NBFC లైసెన్స్‌ని కలిగి ఉంది. 

Latest Videos

షేర్ హోల్డర్లకు ఏం లభించింది…

డీమర్జర్  తర్వాత, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  వాటాదారులు ప్రతి షేరుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఒక షేరును అందుకుంటారు. ఈ రికార్డు జులై 19న ఫిక్స్ అయింది. అంటే జూలై 19 వరకు రిలయన్స్ షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే జియో ఫైనాన్షియల్ షేర్లను పొందుతారు. రిలయన్స్, జియో ఫైనాన్షియల్‌ల విభజన ప్రకారం, రిలయన్స్‌లో ఒక షేరును కలిగి ఉన్న వారు జియో ఫైనాన్షియల్‌లో 1 షేరును పొందుతారని నిర్ణయించారు. 

ఈ రోజు ట్రేడింగ్ డే ముగిసే సమయానికి మీరు రిలయన్స్ 36 లక్షల మంది వాటాదారులలో ఒకరు అయితే, ఒక రిలయన్స్ షేరుకు ఒక జియో ఫైనాన్షియల్ షేరును పొందుతారు. దీని కోసం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. జియో ఫైనాన్షియల్ షేర్లు లిస్ట్ అయినప్పుడు, దాని షేర్లు మీ డీమ్యాట్ ఖాతాలోకి వస్తాయి.

షేర్లను ఎలా విభజించారు..

ఒక కంపెనీ విడిపోయినప్పుడు, దాని వాటా రెండు భాగాలుగా విభజిస్తారు. రిలయన్స్ నుండి జియో ఫైనాన్షియల్ వేరు అయినప్పుడు, డీమర్జ్ యూనిట్ షేర్ ధర ఇప్పటికే ఉన్న కంపెనీ షేర్ ధర నుండి తీసివేస్తారు. ఈ విధంగా పాత, కొత్త రెండు యూనిట్ల షేర్ ధర నిర్ణయిస్తారు.

NSEలో ఉదయం 10 గంటలకు రిలయన్స్ షేర్ సర్దుబాటు ధర రూ. 2580 వద్ద నిర్ణయించారు. దీని ప్రకారం జియో ఫైనాన్షియల్ షేర్ ధర రూ.261.85గా నిర్ణయం జరిగింది. రిలయన్స్ స్టాక్ కొత్త లిస్టింగ్ ధర రూ.2617 అయినప్పటికీ. రిలయన్స్ స్టాక్ సుమారు ఉదయం 11 గంటల సమయంలో సర్దుబాటు ధర (రూ. 2580) నుండి రూ. 38 లేదా 1.47 శాతం బలంతో రూ. 2618 వద్ద కనిపించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగదారు, మర్చంట్ లోన్ వ్యాపారాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా ఫిన్‌టెక్‌ల నుండి భిన్నంగా ఉంటుంది.

click me!