వచ్చే నెల నుండి మారనున్న బ్యాంకు లావాదేవీల నియమాలు.. దీని వల్ల లాభాలెంటో తెలుసుకోండి..

By Sandra Ashok KumarFirst Published Nov 21, 2020, 2:13 PM IST
Highlights

ఇప్పుడు కోట్ల మంది భారతీయ వినియోగదారుల కోసం ఆర్‌బిఐ మరో పెద్ద ప్రకటన చేసింది. వచ్చే నెల నుండి బ్యాంకులు వినియోగదారుల లావాదేవీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన నియమాన్ని మార్చబోతుంది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కొత్త కొత్త సదుపాయాలని ప్రకటిస్తూనే ఉంది. ఇప్పుడు కోట్ల మంది భారతీయ వినియోగదారుల కోసం ఆర్‌బిఐ మరో పెద్ద ప్రకటన చేసింది. వచ్చే నెల నుండి బ్యాంకులు వినియోగదారుల లావాదేవీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన నియమాన్ని మార్చబోతుంది.

రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టిజిఎస్) సిస్టమ్ డిసెంబర్ 2020 నుండి రోజుకు 24 గంటలు పనిచేస్తుందని అక్టోబర్‌లో ఆర్‌బిఐ ప్రకటించింది. అంటే డిసెంబర్ నుండి పెద్ద మొత్తాన్ని బదిలీ చేయడానికి మీరు బ్యాంక్ పని వేళలు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.  

మానేటరీ పాలిసి కమిటీ (ఎంపిసి) ఈ నిర్ణయాలను ప్రకటించగా, గవర్నర్ శక్తికాంత దాస్ వినియోగదారులకు తెలిపారు. ప్రస్తుతం వినియోగదారుల కోసం ఆర్‌టి‌జి‌ఎస్ సిస్టమ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉండేది. బ్యాంక్ సెలవులు, రెండవ ఇంకా నాల్గవ శనివారాలలో కూడా ఆర్‌టి‌జి‌ఎస్ సౌకర్యం అందుబాటులో ఉండదు.

దీనితో పాటు ఆదివారం కూడా బ్యాంకులకు సెలవు.  కరోనా లాక్ డౌన్ సమయం నుండి దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి ఆర్‌బిఐ ఈ చర్య తీసుకున్నది.

కనీస పరిమితి రెండు లక్షలు

కరోనా యుగంలో డిజిటల్ బ్యాంకింగ్ వాడకం అధికంగా పెరిగింది. ఆర్‌టిజీఎస్ కింద కనీస నగదు బదిలీ మొత్తం రెండు లక్షల రూపాయలు అని తెలిపింది. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు.

also read 


ఆర్‌టి‌జి‌ఎస్ అంటే ఏమిటి?

ఆర్‌టి‌జి‌ఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టం. 'రియల్ టైమ్' అంటే తక్షణం. మీరు డబ్బు బదిలీ చేసిన వెంటనే అది ఇతరుల ఖాతాకు చేరుకుంటుంది. మీరు ఆర్‌టి‌జి‌ఎస్ ద్వారా లావాదేవీ చేసినప్పుడు, డబ్బు వెంటనే మరొక ఖాతాకు బదిలీ చేయబడుతుంది. 

ఆర్‌టిజిఎస్ సౌకర్యం ఉచితం
6 జూన్  2019న ఆర్‌బిఐ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, నేషనల్ ఎలక్ట్రిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (ఎన్‌ఇఎఫ్‌టి) ద్వారా లావాదేవీలను ఉచితంగా చేసింది.

ఎన్‌ఈ‌ఎఫ్‌టి సౌకర్యం కూడా 24 గంటలు అందుబాటులోకి
16 డిసెంబర్ 2019 నుండి, అన్ని బ్యాంకులలో 24 గంటల పాటు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (ఎన్‌ఈ‌ఎఫ్‌టి ) సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. వీటిని అమలు చేయమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది.

కాగా అంతకుముందు ఎన్‌ఇఎఫ్‌టిసౌకర్యం ఉదయం 8 నుండి 7 గంటల వరకు ఉండేది. ఎన్‌ఈ‌ఎఫ్‌టి అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఇంటర్నెట్ ద్వారా రెండు లక్షల రూపాయల లావాదేవీల వరకు  ఎన్‌ఈ‌ఎఫ్‌టి ఉపయోగించుకోవచ్చు. మీ డబ్బును  ఏదైనా బ్యాంక్ శాఖ నుండి ఇతర బ్యాంకు ఖాతాకు పంపవచ్చు.  

click me!