ఆర్‌కామ్ దివాళా: అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ

By Siva KodatiFirst Published Nov 24, 2019, 4:53 PM IST
Highlights

తీవ్ర ఆర్ధిక నష్టాలతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా తీయడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. సంస్థ డైరెక్టర్ బాధ్యతల నుంచి అనిల్ అంబానీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అనిల్ రాజీనామాను రుణ సంస్థల కమిటీ (సీఓసీ) తిరస్కరించింది

తీవ్ర ఆర్ధిక నష్టాలతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా తీయడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. సంస్థ డైరెక్టర్ బాధ్యతల నుంచి అనిల్ అంబానీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అనిల్ రాజీనామాను రుణ సంస్థల కమిటీ (సీఓసీ) తిరస్కరించింది.

దీవాళాను ప్రకటించిన తర్వాత అనిల్ అంబానీతో పాటు మరో నలుగురు డైరెక్టర్లు ఛాయా విరాని, రైనా కరాని, మంజరీ కాకర్, సురేశ్ రంగాచార్, సీఎఫ్‌వో మణికంఠన్. వి కూడా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. వీరందరి రాజీనామాలను రుణ సంస్థల కమిటీకి పరిశీలిన నిమిత్తం పంపించారు. అయితే వీటిని సీఓసీ తిరస్కరించినట్లు బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది. 

Also Read: ఆర్ కామ్ దివాళా .... అనిల్ అంబానీ రాజీనామా

మార్కెట్లో ఉన్న మిగిలిన నేటివరకులను తట్టుకోలేక అనిల్ అంబానీ కంపెనీ ఆర్ కామ్ మూతపడే స్థాయికి చేరుకుంది, ఇప్పటికే దివాళా తీసింది. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఒక ఒప్పందం కుదిరింది కూడా. కాకపోతే రోజు రోజుకి పెరుగుతున్న అప్పులు, వాటిపైన వడ్డీ భారం, మార్కెట్ను జియో ఊపేస్తున్న వైనం అన్ని వెరసి అనిల్ అంబానీ కంపెనీ ఆర్ కామ్ ను కోలుకోలేని దెబ్బతీశాయి. 

మార్కెట్లో ప్రస్తుత తరుణంలో ఐడియా-వోడాఫోన్, ఎయిర్టెల్, జియో మూడు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ రేట్లకు తమ కంపెనీ సేవలను అందించలేకపోవడంతోపాటు, ఉన్న యూజర్లు కూడా వేరే నెట్వర్క్ లకు మారుతున్నారు. ఈ పోటీని తట్టుకొని నిలవడం కష్టమని భావించిన అనిల్ అంబానీ ఆర్ కామ్ కంపెనీ పదవికి రాజీనామా చేసి కంపెనీని అమ్మకానికి పెట్టాడు.

Also Read: video news : కథ ముగిసిన రిలయన్స్ కంపెనీ...

అనిలా అంబానీకి చెందిన అనేక సంస్థలు కూడా నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి.  అనిల్ అంబానీకి చెందిన మిగిలిన సంస్థలకు కూడా ఆర్ కామ్ భారీగా బకాయిపడ్డది. ఇందుకోసమని ఆస్తులను తాకట్టు పెట్టాలని లేదా అమ్మేయాలని అనిల్ అంబానీ గతంలోనే నిర్ణయించారు. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ముంబైలోని  అతి విలాసవంతమైన భవన సముదాయం  విక్రయించడం గానీ, అద్దెకివ్వడమో చేయాలని యోచిస్తున్నారట.

సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ కూడా గత నెలలో కుబేరుల క్లబ్ నుంచి కిందికి జారుకున్నారు. 2018 మార్చి నాటికి  రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగా ఉంది.11 ఏళ్లలో అనిల్ అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ రూ. 3,651 కోట్లకు (23 523 మిలియన్లు) కుప్పకూలింది.

click me!