మార్కెట్లోకి కొత్త రూ.20నోటు

Published : Apr 27, 2019, 01:14 PM ISTUpdated : Apr 27, 2019, 01:15 PM IST
మార్కెట్లోకి కొత్త రూ.20నోటు

సారాంశం

ఇప్పటి వరకు మార్కెట్లోకి కొత్త రూ.2వేల నోటు, రూ.100, రూ.500, రూ.50, రూ.200, రూ.10 నోట్లను చూసే ఉంటారు. ఇప్పుడు మార్కెట్లోకి రూ.20నోటు అడుగుపెట్టనుంది. 

ఇప్పటి వరకు మార్కెట్లోకి కొత్త రూ.2వేల నోటు, రూ.100, రూ.500, రూ.50, రూ.200, రూ.10 నోట్లను చూసే ఉంటారు. ఇప్పుడు మార్కెట్లోకి రూ.20నోటు అడుగుపెట్టనుంది. మహాత్మగాంధీ సిరీస్ లో ఈ రూ.20నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రూ.20నోటు ఎరుపు రంగులో ఉంటుంది. కాగా.. ఈ  కొత్త నోటు ఆకుపచ్చ, పసుపు రెండు రంగుల కాంబినేషన్ లో ఉంటుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది. దీంతోపాటు అశోకుడి స్తంభం కూడా ఉంటుంది. ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్‌ లోగో కూడా ఉంటుంది.

 

 

PREV
click me!

Recommended Stories

Post office: ఇలా చేస్తే మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం.. 5 ఏళ్లలో రూ. 4.5 లక్ష‌ల వ‌డ్డీ
Silver Price: ల‌క్ష రూపాయ‌లు ప‌డిపోనున్న వెండి ధ‌ర‌.. ఆ రోజులు మ‌ళ్లీ రిపీట్ కానున్నాయా.?