
కరోనా వైరస్ (కోవిడ్ -19) దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గతంలో ఈఎంఐలపై ఇచ్చిన మూడు నెలల మారటోరియాన్ని ఇప్పుడు ఆర్‌బిఐ మళ్లీ పొడిగించింది. ఈఎంఐలపై మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నా జూన్ 1 తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
ఇవాళ ముంబైలో ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించామని, దీంతో రెపో రేటు 4.4 శాతం నుంచి 4 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు. దీని వల్ల ఈఎంఐలో తీసుకున్న రుణాలపై భారం తగ్గనున్నదని తెలిపారు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతానికి తగ్గిందని, రివర్స్ రెపో రేటు ఇప్పుడు 3.35 శాతంగా ఉందని శక్తికాంత దాస్ తన ప్రసంగంలో చెప్పారు.
also read అమెరికా, చైనా మధ్య వైరం: చైనా దిగ్గజాలకు గండం ...
కోవిడ్ 19(కరోనా వైరస్) సంక్షోభం నుండి బయటపడటానికి తాత్కాలిక నిషేధం మాత్రమే సరిపోదు కాబట్టి యాక్సిస్ బ్యాంక్, ఎన్‌బిఎఫ్‌సిలు రుణ పునర్నిర్మాణ పథకాన్ని డిమాండ్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది వాణిజ్యం సుమారు 13 నుంచి 32 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
ప్రైవేటు సంస్థల వినియోగం దారుణంగా పడిపోయినట్లు ఆయన చెప్పారు. కీలకమైన పరిశ్రమల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిందన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 8.6 శాతానికి చేరినట్లు చెప్పారు. కూరగాయలు, నూనెదినుసులు, పాల ధరలు తారాస్థాయికి చేరినట్లు చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది నెగటివ్‌లోనే ఉంటుం