లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు.. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు

By Siva KodatiFirst Published Aug 13, 2022, 7:17 PM IST
Highlights

లోన్ రికవరీల వేధింపులు ఎక్కువ కావడంతో రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉదయం 8 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత రుణ గ్రహీతలకు కాల్స్ చేయొద్దని ఆదేశించింది

లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు సంబంధించి విమర్శలు రావడంతో పాటు, మీడియాలోనూ కథనాలు రావడంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. దీనిలో భాగంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, రికవరీ సంస్థలకు ఆర్‌బీఐ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఉదయం 8 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత రుణ గ్రహీతలకు కాల్స్ చేయొద్దని ఆదేశించింది. లోన్ తీసుకుని సరిగా కట్టలేకపోయిన వారిపై మానసిక, శారీరిక వేధింపులకు పాల్పడొద్దని ఆదేశించింది. ఎట్టి పరిస్ధితుల్లో బెదిరింపు మెసేజ్‌లు పెట్టొద్దని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. రుణాలు తీసుకుని వాయిదాలు సరిగా కట్టలేనివారిపై రికవరీ ఏజెంట్లు వేధింపులు ఇటీవల ఎక్కువైన సంగతి తెలిసిందే

click me!