Boycott Laal Singh Chaddha: షేర్ మార్కెట్లో PVR స్టాక్స్ ను కుదేలు చేసిన లాల్ సింగ్ చద్దా బాయ్ కాట్ ప్రచారం..

By Krishna AdithyaFirst Published Aug 13, 2022, 3:50 PM IST
Highlights

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటే అమీర్ ఖాన్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా' విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో కూరుకుపోవడం సినిమా కలెక్షన్లపైనా కనిపిస్తోంది. ఊహించిన దాని కంటే తక్కువ కలెక్షన్స్ కారణంగా, మల్టీప్లెక్స్ PVR స్టాక్ ఘోరంగా క్రాష్ అయ్యింది. దీంతో ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో నష్టపోయారు. ఈ సినిమా కంపెనీ స్టాక్‌ను ఎలా ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకుందాం.

వాస్తవానికి, వారం చివరి ట్రేడింగ్ రోజున అంటే శుక్రవారం, PVR షేర్ ధర 2.18% నష్టంతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి PVR షేరు ధర రూ. 2015.35 వద్ద ఉంది. ట్రేడింగ్ సమయంలో షేరు ధర రూ. 2004.25 కనిష్ట స్థాయికి దిగజారింది. మార్కెట్ క్యాపిటల్ విషయానికి వస్తే రూ.12,308.98 కోట్లుగా ఉంది. 

ఆగస్టు 11న షేరు ధర రూ.2150 స్థాయికి చేరుకోవడం కూడా ఆసక్తికరమే. అదే రోజు అమీర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలైంది. ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డులు బద్దలు కొడుతుందని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఆగస్టు 4న PVR స్టాక్ ధర రూ. 2,211.55కి పెరిగింది. ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి.

PVRపై లాల్ సింగ్ చద్దా ప్రభావం ఎలా పడింది..?

స్టాక్ మార్కెట్ నిపుణుడు సచిన్ సర్వేదే ప్రకారం, మల్టీప్లెక్స్ చైన్ PVR అమీర్ ఖాన్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా' విడుదలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, పివిఆర్ తన థియేటర్లలో 65 శాతం షోలను 'లాల్ సింగ్ చద్దా'కి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ చిత్రానికి పీవీఆర్ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ప్రేక్షకుల కొరత కారణంగా షోలు రద్దయ్యాయని చాలా చోట్ల నివేదికలు కూడా వచ్చాయని సచిన్ సర్వేడే చెప్పారు. అలాగే లాల్ సింగ్ చద్దా బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కూడా  కంపెనీ స్టాక్‌ను దెబ్బతీయడానికి కారణం అయ్యాయి. ఇది కాకుండా, అక్షయ్ కుమార్ చిత్రం 'రక్షా బంధన్'కి PVR 35 శాతం షోలు ఇచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్ కూడా పెద్దగా లేవు.

బాయ్ కాట్ ప్రభావం: గత కొంతకాలంగా, బాలీవుడ్ చిత్రాలను నిరంతరం బాయ్ కాట్ చేస్తున్నారు. 'లాల్ సింగ్ చద్దా' సినిమా ద్వారా ఈ బాయ్ కాట్ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. సినిమా నటీనటులు - అమీర్ ఖాన్ , కరీనా కపూర్ లకు సంబంధించిన పలు వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో ఈ బాయ్ కాట్ ఉద్యమం ఊపందుకుంది.

అయితే సినిమా విడుదలకు ముందు అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పి సినిమా చూడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా ఈ సినిమా సబ్జెక్ట్ ఓ ఇంగ్లీషు సినిమా రీమేక్ అని, అలాగే సబ్జెక్టు కూడా అంతగా ఆకట్టుకోలేక పోవడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు ఆకర్షితులు కాలేకపోయారు. గతంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ఆల్ టైం రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్లింది. అయితే లాల్ సింగ్ చద్దా చిత్రానికి బాయ్ కాట్ పిలుపుతో పాటు సినిమా కంటెంట్ కూడా బలహీనంగా ఉండటంతో పాటు, నెగిటివ్ రివ్యూలు కూడా సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది.

click me!