
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం (ఆగస్టు 6) న కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 5.5% వద్దనే స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం ఫలితాలను వెల్లడించారు. "ఎంపిసి పాలసీ రెపో రేటును 5.5% వద్దనే ఉంచాలని నిర్ణయించింది" అని ఆయన తెలిపారు. ఈ నిర్ణయానికి రియల్ ఎస్టేట్ రంగంలోని కీలక వ్యక్తుల నుండి సానుకూల స్పందన వస్తోంది.
M5 మహేంద్ర గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాగరాజు RBI నిర్ణయాన్ని ప్రశంసించారు. "ఆర్బిఐ రెపో రేటును 5.5% వద్ద ఉంచడం మంచి నిర్ణయం" అని ఆయన అన్నారు.
రేపో రేటు స్థిరంగా ఉంచడంవల్ల గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి… ఇది కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారికి మంచిది. "ఈ పాలసీ డెవలపర్లు మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది" అని నాగరాజు పేర్కొన్నారు.
బెన్నెట్ ఆండ్ బెర్నార్డ్ చైర్మన్, వ్యవస్థాపకులు లింకన్ బెన్నెట్ రోడ్రిగ్స్ మాట్లాడుతూ… స్థిరమైన రెపో రేట్లు ఊహించినవేనని అన్నారు. లగ్జరీ రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులపై ఇది పెద్దగా ప్రభావం చూపదని అన్నారు. "లగ్జరీ రియల్ ఎస్టేట్‌లో వడ్డీ రేట్లు ప్రధాన కారకం కాదు. కొనుగోలుదారులు దీర్ఘకాలిక విలువ, వారసత్వం, జీవన నాణ్యత కోసం పెట్టుబడి పెడుతున్నారు'' అని ఆయన వివరించారు.
గోవా వంటి మార్కెట్లలో అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు, NRIలు, అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు తక్కువ ధర కంటే ప్రత్యేకత, స్థిరత్వంపై ఎక్కువ ఆసక్తి చూపుతారని రోడ్రిగ్స్ అన్నారు. RBI నిర్ణయం ఆ స్థిరత్వ భావాన్ని బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
స్టెర్లింగ్ డెవలపర్స్ చైర్మన్, ఎండి రమణి శాస్త్రి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచడానికే మద్దతు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుత రేటు వాతావరణానికి అనుగుణంగా ఉందనన్నారు.
"ముఖ్యంగా మిడ్, ప్రీమియం, లగ్జరీ విభాగాలలో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా బలమైన వినియోగదారుల డిమాండ్‌ను మేము చూశాము" అని శాస్త్రి అన్నారు. "ఈ రెపో రేటు స్థిరంగా ఉంచడం ప్రస్తుత అమ్మకాల వేగాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుంది" అని అభిప్రాయపడ్డారు.
రెపో రేటు స్థిరంగా ఉంచుతూ ఆర్బిఐ తీసుకున్న నిర్ణయం గృహ కొనుగోలుదారులకు స్థిరమైన రుణ నిబంధనలపై నమ్మకం కలిగిస్తుందని, డెవలపర్లకు ముందుగానే ప్రణాళిక వేసుకోవడానికి స్పష్టతను అందిస్తుందని ఆయన అన్నారు. "నిరంతర డిమాండ్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది… తద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధికి ఈ రంగం కీలక స్తంభంగా ఉంటుంది'' అని రమణి శాస్త్రి తెలిపారు..