
ఈ మధ్య కాలంలో చాలా కోఆపరేటివ్ బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. దీంతో ఆర్బీఐ దీంతో ఆర్‌బీఐ ఆగ్రహానికి ఈ బ్యాంకులు గురవుతున్నాయి.తాజాగా మార్గదర్శకాలు పాటించని కర్ణాటకకు చెందిన ఓ సహకార బ్యాంకుపై రెగ్యులేటరీ చర్యలు తీసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ సహకార బ్యాంకుపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. అయితే ఆ బ్యాంకు కార్యకలాపాలపై ఆర్బీఐ నియంత్రణలోకి తీసుకున్న దృష్ట్యా బ్యాంకు కస్టమర్లు అకౌంట్ల నుంచి రూ.5 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీలులేదు.
ఆర్‌బీఐ గతంలో చాలాసార్లు ఇలాంటి సహకార బ్యాంకులపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు అలాంటిదే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. బెంగళూరులోని సహకార బ్యాంకుపై ఆర్‌బీఐ నిషేధం విధించింది. ఈ పరిమితి ప్రకారం, ఇప్పుడు ఖాతాదారులు బ్యాంకు నుండి రూ. 5,000 మాత్రమే విత్‌డ్రా చేయగలరు.
RBI నిషేధించిన బ్యాంకు ఇదే?
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న శుశ్రుతి సౌహార్ద సహకార బ్యాంకు నియమిత (Shushruti Souharda Sahakara Bank Niyamita)పై RBI నిషేధం విధించింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నందున సెంట్రల్ బ్యాంక్ ఆ బ్యాంకుపై నిషేధం విధించింది.
నిషేధం ఎప్పుడు అమలులోకి వస్తుంది
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7, 2022న వ్యాపారం ముగిసిన నాటి నుంచి ఆరు నెలల కాలానికి ఈ సూచనలు వర్తిస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. RBI నుండి సాధారణ అనుమతి లేకుండా Shushruti Soudha Sahakari బ్యాంక్ ఏదైనా రుణం లేదా అడ్వాన్స్ మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం సాధ్యం కాదు. అలాగే పెట్టుబడి పెట్టలేరు. తాజా డిపాజిట్లను స్వీకరించకుండా కూడా బ్యాంకుపై నిషేధం విధించారు. సేవింగ్స్ ఖాతా లేదా కరెంట్ ఖాతా లేదా డిపాజిటర్ కు చెందిన ఏదైనా ఇతర ఖాతాలో మొత్తం బ్యాలెన్స్‌లో రూ. 5,000 మించకుండా విత్‌డ్రా చేయడం అనుమతించబడదు.
బ్యాంకు బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది
'బ్యాంక్ తన ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు పరిమితులతో బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది' అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ పరిస్థితులను బట్టి ఈ ఆదేశాలను సవరించడాన్ని కూడా పరిగణించవచ్చు. ఇటీవల, సెంట్రల్ బ్యాంక్ వివిధ నిబంధనలకు విరుద్ధంగా మూడు సహకార బ్యాంకులపై మొత్తం రూ.5 లక్షల జరిమానా విధించింది.