యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బి‌ఐ

Ashok Kumar   | Asianet News
Published : Mar 16, 2020, 05:14 PM ISTUpdated : Mar 16, 2020, 09:48 PM IST
యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బి‌ఐ

సారాంశం

కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి కారణంగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం అవుతున్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు.  

కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి కారణంగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం అవుతున్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కరోనావైరస్  (COVID-19)పై పోరాడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ రెండు-దశల యంత్రాంగాన్ని ప్రకటించారు, కాని అతను  రేపో రేటు తగ్గింపుపై  ఎలాంటి  సమాచారాన్ని ప్రకటించలేదు.  

యెస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక ఒక్కటి చివరిది. యెస్ బ్యాంక్ కస్టమర్లు వారి డబ్బు గురుంచి చింతించాల్సిన అవసరం లేదు వారు సేవింగ్స్ ఖాతా నుండి తమ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

also read కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ ఆ రూ.2000 కోట్లు ఏం చేశారు? ... 

  యెస్ బ్యాంక్ మొరటోరియం మార్చి 18 బుధవారం   సాయంత్రం 6 నుండి ఎత్తివేయనుంది. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా సురక్షితం. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు చాలా ముఖ్యమైనవి ఇంకా అవి మంచి స్థితిలో ఉన్నాయని ఆర్బిఐ గవర్నర్ చెప్పారు.

 యెస్ బ్యాంక్‌లో పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు ఉన్నారు . యెస్ బ్యాంక్ పునరుద్ధరణలో భాగంగా పెద్ద బ్యాంకింగ్ రంగాలు  పాల్గొంటున్నాయని దాస్ తెలిపారు. అవసరమైతే ఆర్‌బిఐ లిక్విడిటీని కూడా అందిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తికి, ఆర్థిక వ్యవస్థ పతనంపై ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడరు.

కరోనా వైరస్  ప్రభావం వల్ల  పర్యాటకం, విమానయాన సంస్థలు, హాస్పిటాలిటీ, ఇతర రంగాల వంటి ప్రపంచ రంగాలు దాని వల్ల తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నాయి. కరోనావైరస్ మరింతగా వ్యాపిస్తే ఆర్థిక వ్యవస్థ మరింత నష్టపోతుంది అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్