రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) Paytm పేమెంట్స్ బ్యాంక్‌కి షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత కొత్త డిపాజిట్లను స్వీకరించరాదని ఆదేశించింది. మార్చి 11న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను కొత్త కస్టమర్లు వాడకుండా ఆర్‌బీఐ నిషేధించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) Paytm పేమెంట్స్ బ్యాంక్‌కి షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత కొత్త డిపాజిట్లను స్వీకరించరాదని ఆదేశించింది. మార్చి 11న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను కొత్త కస్టమర్లు వాడకుండా ఆర్‌బీఐ నిషేధించింది. కాంప్రహెన్షియవ్ బ్యాంక్ సిస్టమ్ ఆడిట్ నివేదిక , ఎక్స్‌టర్నల్ ఆడిట్‌ల తదుపరి సమ్మతి ధ్రువీకరణ నివేదిక .. బ్యాంక్‌లో నిరంతర సమ్మతి, నిరంతర మెటీరియల్ సూపర్‌వైజరీ అలర్ట్‌లను బహిర్గతం చేసి తదుపరి పర్యవేక్షక చర్యలకు హామీ ఇచ్చింది.
ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఏవైనా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు , వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్ , ఎన్‌సీఎంసీ కార్డ్‌లు మొదలైన వాటిలో ఏవైనా వడ్డీలు, క్యాష్‌బ్యాక్‌లు లేదా ఎప్పుడైనా క్రెడిట్ చేయబడే రీఫండ్‌లు కాకుండా తదుపరి డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్‌లు అనుమతించబడవని ఆర్బీఐ తెలిపింది. అయితే సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్ట్‌ట్యాగ్‌లు , నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు మొదలైన వాటితో సహా రుణదాత కస్ట్‌మర్‌ల ఖాతాల నుంచి నగదు ఉపసంహరించుకోవడం లేదా వినియోగించుకోవడం వంటి వాటిపై ఎలాంటి పరిమితులు వుండవని ఆర్‌బీఐ తెలిపింది.