79వేల ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.7,599 మాత్రమే.. క్రెడిట్ కార్డ్ పై డిస్కౌంట్ కూడా...

By Ashok kumar Sandra  |  First Published Jan 31, 2024, 5:31 PM IST

చాలా మంది ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తారు. కానీ అధిక  ఖర్చు కారణంగా  కొనడానికి వెనకడుగువేస్తారు. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
 


ఆపిల్ ఐఫోన్ 13 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడవుతున్న Apple iPhone మోడల్‌లలో ఒకటి. Apple iPhone 13కి Flipkart సేల్ లో అద్భుతమైన స్పందన లభించింది. ఆపిల్ ఐఫోన్ 13 2021లో రూ.79,900 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఆపిల్ స్టోర్‌లో ప్రస్తుతం దీని ధర రూ.59,900.కానీ ఇప్పుడు  తక్కువ ధరకే లభిస్తుంది. అంతే కాదు Apple iPhone 13ని Flipkart నుండి కేవలం 7,599 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

మీరు Apple iPhone 13 కంటే బడ్జెట్‌లో ప్రీమియం Apple iPhoneని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే Flipkart సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. మీరు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ లెవెల్   మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, Apple iPhone 13 నిస్సందేహంగా బెస్ట్ అప్షన్స్ లో ఒకటి. 

Latest Videos

Apple iPhone 13 ఇప్పుడు Apple అధికారిక స్టోర్‌లో చౌకైన ఫోన్ గా అందుబాటులో ఉంది. Apple iPhone 13 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 6,901 తగ్గింపు తర్వాత రూ. 52,999కి లభిస్తుంది. అదనంగా, కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1000 వరకు తగ్గింపుతో    రూ.51,999 పొందవచ్చు. 

అంతేకాకుండా, కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ.44,400 వరకు తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్‌లు అండ్  బ్యాంక్ డిస్కౌంట్‌లతో కొనుగోలుదారులు Apple iPhone 13ని ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి కేవలం రూ.7,599కి పొందవచ్చు.

Apple iPhone 13 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌తో 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది.   నైట్ మోడ్‌తో 12MP TrueDepth ఫ్రంట్ కెమెరాను కూడా పొందుతుంది. ఐఫోన్ 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 

ఆపిల్ ఐఫోన్ 13 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్‌లలో ఒకటి. ఆపిల్ ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో అత్యధికంగా అమ్ముడైన మొబైల్‌గా గుర్తించబడింది. Apple iPhone 15 సిరీస్‌ను ప్రారంభించడంతో, Apple iPhone 13 ధరను గణనీయంగా తగ్గించింది ఇంకా  గతంలో కంటే చౌకగా లభిస్తుంది.

click me!