మాజీ ఉద్యోగి కోసం 150 కి.మీ ప్రయాణించిన రతన్ టాటా.. కారణం తెలిస్తే వావ్ అంటారు..

Ashok Kumar   | Asianet News
Published : Jan 07, 2021, 05:50 PM ISTUpdated : Jan 07, 2021, 11:46 PM IST
మాజీ ఉద్యోగి కోసం 150 కి.మీ ప్రయాణించిన రతన్ టాటా.. కారణం తెలిస్తే వావ్ అంటారు..

సారాంశం

ప్రజలు రతన్ టాటాను ఎందుకు ఇష్టపడుతారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రస్తుతం రతన్ టాటా ముంబై నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కంపెనీ మాజీ ఉద్యోగి శ్రేయస్సు గురించి అడిగి తెలుసుకున్నారు.

ముంబై:  టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా తన దాతృత్వ హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రజలు రతన్ టాటాను ఎందుకు ఇష్టపడుతారు అనడానికి ఇది ఒక నిదర్శనం.

ప్రస్తుతం రతన్ టాటా ముంబై నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కంపెనీ మాజీ ఉద్యోగి శ్రేయస్సు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు రతన్ టాటా ముంబై నుండి వందకు పైగా కిలోమీటర్ల  దూరంలో ఉన్న పూణేకు వెళ్లిన విషయం సోషల్ మీడియాలో భారీగా వైరల్  అయ్యింది. దీంతో రతన్ టాటా మరోసారి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. 

also read మీరు ఒక్కసారి ఈ ఎల్ఐసి పథకంలో పెట్టుబడి పెడితే, మీకు జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. ...

విషయం ఏంటంటే రతన్ టాటా సంస్థలో ఉద్యోగం చేస్తున్న పూణే నివాసి యోగేశ్ దేశాయ్ గత 2 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రతన్ టాటా వెంటనే,  అతను నివసిస్తున్న పూణేలోని ఫ్రెండ్స్ సొసైటీని సందర్శించి పరమర్శించారు.

 రతన్ టాటా తనను కలిశారని, తన కుటుంబ శ్రేయస్సు గురించి ఆరా తీసి తెలుసుకున్నారని యోగేశ్ దేశాయ్ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారు.  

రతన్ టాటా ప్రస్తుతం 83 సంవత్సరాలు. అంతటి అనుభవజ్ఞులు  అయిన ఆయన ఈ వయస్సులో ఒక ఉద్యోగి ఆరోగ్యం గురించి ఆరా తీసి తెలుసుకోవడాన్ని  మాజీ ఉద్యోగి సంతోశంతో రతన్ టాటాను అభినందిస్తు పోస్ట్ చేశారు.

'డబ్బు, ఆస్తి కన్నా మానవత్వం పెద్దది. రతన్ టాటా అటువంటి మానవత్వ స్వరూపులుగా గౌరవించబడ్డాడు. "  అంటూ పోస్ట్ లో రాశాడు. అంతేకాదు ఈ సంఘటనతో చాలామంది రతన్ టాటా సింప్లిసిటీ గురించి, కొందరు యజమాని, ఉద్యోగుల సంబంధం గురించి చర్చించడం ప్రారంభించారు. 
 

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు