Bluestone Jewellery IPO: రతన్ టాటా పెట్టుబడి పెట్టిన బ్లూస్టోన్ జువెలరీ IPO సన్నాహాలు ప్రారంభం

Published : Mar 01, 2022, 10:16 AM ISTUpdated : Mar 01, 2022, 10:22 AM IST
Bluestone Jewellery IPO: రతన్ టాటా పెట్టుబడి పెట్టిన బ్లూస్టోన్ జువెలరీ IPO సన్నాహాలు ప్రారంభం

సారాంశం

దేశంలోనే అతిపెద్ద ఆన్ లైన్  జ్యువెలరీ చైన్ బ్లూస్టోన్ జ్యువెలరీ రూ.1500 కోట్ల IPOను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.పెట్టుబడుల ద్వారా కంపెనీ పెద్ద ఎత్తున షోరూంలను దేశ వ్యాప్తంగా ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. 

దేశంలో ఐపీవోల సందడి ఏ మాత్రం తగ్గడం లేదు. LIC IPO కన్నా ముందే మరిన్ని ఐపీవోలు దేశీయ మార్కెట్లో సందడి చేయనున్నాయి. వాటిలో ప్రధానంగా దేశంలోనే అతిపెద్ద జ్యువెలరీ చైన్ బ్లూస్టోన్ జ్యువెలరీ రూ.1500 కోట్ల IPOను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ కంపెనీలో రతన్ టాటాకు పెట్టుబడులు పెట్టడం విశేషం. బ్లూస్టోన్ జ్యువెలరీ ఇప్పటికే ICICI సెక్యూరిటీస్, IIFL సెక్యూరిటీస్, Jefferies, JM ఫైనాన్షియల్‌లను ఇష్యూ కోసం ఇన్వెస్ట్ మెంట్  బ్యాంకర్‌లుగా నియమించింది.  కంపెనీ వాల్యుయేషన్ రూ.12,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల రేంజ్‌లో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

కంపెనీ 2022-2023 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో తన IPOని తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కంపెనీ బిజినెస్ మోడల్ విషయానికి వస్తే  జ్యువెలరీ మార్కెట్ స్పేస్ లో ఇది ఆన్‌లైన్ ప్లాట్ ఫాం Bluestone.com ద్వారా ఆభరణాలను విక్రయిస్తోంది. ముఖ్యంగా కంపెనీ ఎక్కువగా మోడర్న్ కలెక్షన్లపై దృష్టి సారించింది. డైమండ్స్, జెమ్స్ ఉపయోగించి మహిళలను ఆకట్టుకునే మోడర్న్ జువలెరీ తయారీలో బ్లూ స్టోన్ మంచి మార్కెట్ ప్లేస్ ను సాధించింది.

కంపెనీ ఇష్యూ పూర్తిగా అమ్మకానికి సంబంధించినదని గమనించాలి. కంపెనీకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులు తమ వాటాలను విక్రయించవచ్చు. వీటిలో, కలారి క్యాపిటల్‌తో సహా కొన్ని కంపెనీలు తమ వాటాలో కొంత భాగాన్ని లేదా మొత్తం విక్రయించవచ్చు. ఈ విషయం గురించి తెలిసిన ఒక  సోర్స్ తెలిపిన సమాచారం ప్రకారం, "కంపెనీ వాల్యుయేషన్ ఇంకా ఖరారు కాలేదు. బ్లూస్టోన్ రాబోయే కొద్ది నెలల్లో DRHPని ఫైల్ చేసే అవకాశం ఉంది." అని తెలిపింది. 

బ్లూస్టోన్‌కు ముంబైలో రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. అంతేకాదు ఈ కంపెనీ ప్రధానంగా తన మార్కెటింగ్ విధానాలను మార్చుకుంటోంది. మొదట్లో కేవలం డిజిటిల్ ఆన్ లైన్ ప్లాట్ ఫాంపై మాత్రమే వ్యాపారం చేయగా నెమ్మదిగా షోరూంలను సైతం ప్రారంభిస్తోంది. కంపెనీ తన తొలి ఫిజికల్ షోరూంను 2018లో ఢిల్లీలోని పసిఫిక్ మాల్‌లో ప్రారంభించింది. ఇది కాకుండా చండీగఢ్, ముంబై, హైదరాబాద్‌లలో 5 కొత్త స్టోర్లను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. భారతదేశ ఆభరణాల మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్దది అని గమనించాలి.

కట్ డైమండ్స్, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, ల్యాబ్ మేడ్ డైమండ్స్ ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం ఒకటి. టెక్నోపాక్ ప్రకారం, భారతదేశం యొక్క ఆభరణాల రంగం 2020 నాటికి 64 బిలియన్ డాలర్ల విలువైనదిగా అంచనా వేసింది. బ్లూస్టోన్ లిస్టెడ్ చేసిన తర్వాత మార్కెట్లోని ప్రత్యర్థి కంపెనీల విషయానికి వస్తే టైటాన్ కు చెందిన తనిష్క్ బ్రాండ్ ప్రముఖంగా ఉంది. దీని మార్కెట్ క్యాప్ రూ.2.19 లక్షల కోట్లు. కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెట్ క్యాప్ రూ.20,767 కోట్లు. కాగా పీసీ జువెలర్స్ మార్కెట్ క్యాప్ రూ.6129 కోట్లుగా ఉంది.

PREV
click me!

Recommended Stories

రూ. 1 కోటి టర్మ్ పాలసీ: మీ కుటుంబానికి సరైన ఆర్థిక భద్రత ఇదేనా?
Indian Railway: బ్యాట‌రీ వాహ‌నాలు, వీల్ చైర్‌లు.. రైల్వే స్టేష‌న్‌లో మీకు తెలియ‌ని ఎన్నో సౌక‌ర్యాలు