Petrol Diesel Prices Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లివే.!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 01, 2022, 09:32 AM IST
Petrol Diesel Prices Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లివే.!

సారాంశం

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో 100 డాలర్లు క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, వంద రోజులు దాటిన తర్వాత కూడా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. 

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో 100 డాలర్లు క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, వంద రోజులు దాటిన తర్వాత కూడా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 01, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశముంది.

వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.07, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.75

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.14, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.70, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.52

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు హెచ్చు తగ్గులు నమోదు చేస్తున్నాయి. WTI క్రూడ్ 96.51 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 98.79 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి నుండి సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు ఇటీవల పైపైకి చేరుకున్నాయి. క్రితం సెషన్లోను ధరలు పెరిగాయి.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2022 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా డిమాండ్ తగ్గుతుందని భావించినప్పటికీ, ఇది పెరుగుతుందని పేర్కొంది. సరఫరా డిమాండ్, ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి క్షీణత ప్రభావంతో ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి మండిపోయే అవకాశముంది.
 

PREV
click me!

Recommended Stories

రూ. 1 కోటి టర్మ్ పాలసీ: మీ కుటుంబానికి సరైన ఆర్థిక భద్రత ఇదేనా?
Indian Railway: బ్యాట‌రీ వాహ‌నాలు, వీల్ చైర్‌లు.. రైల్వే స్టేష‌న్‌లో మీకు తెలియ‌ని ఎన్నో సౌక‌ర్యాలు