Rakesh Jhunjhunwala portfolio: రాకేష్ జున్ జున్ వాలా కొన్న ఈ స్టాక్ తక్కువ ధరకే దొరుకుతోంది,మీరు ఓ లుక్కేయండి

Published : Jun 07, 2022, 01:22 PM IST
Rakesh Jhunjhunwala portfolio: రాకేష్ జున్ జున్ వాలా కొన్న ఈ స్టాక్ తక్కువ ధరకే దొరుకుతోంది,మీరు ఓ లుక్కేయండి

సారాంశం

Rakesh Jhunjhunwala portfolio:  స్టాక్ మార్కెట్లో రాకేష్ జున్ జున్ వాలా గురించి తెలియని వారు ఉండరు. ఆయన షేర్ కొన్నాడంటే, ఆ కంపెనీకి మహర్దశ పట్టిందని అర్థం. రాకేష్ పోర్ట్ ఫోలియోను ఇన్వెస్టర్లు గుడ్డిగా పాలో అయిపోతుంటారు. అయితే ఆయన పోర్ట్ పోలియోలోని ఓ షేరు ప్రస్తుతం 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. మరి ఈ షేరులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా. అనేది తెలుసుకుందాం.

Rakesh Jhunjhunwala portfolio: ఇటీవలి మార్కెట్ పతనంలో, భారతీయ స్టాక్ మార్కెట్లో చాలా నాణ్యమైన స్టాక్‌లు కరెక్షన్‌ కు గురయ్యాయి. ఈ జాబితాలో టాటా గ్రూప్‌కు చెందిన టాటా కమ్యూనికేషన్స్ (Tata Communications Limited) కూడా చేరింది. రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయికి సమీపంలో ట్రేడవుతోంది. సరైన ధరలకు నాణ్యమైన స్టాక్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాటా కమ్యూనికేషన్స్ (Tata Communications Limited) ఆర్డర్ బుక్ మెరుగైనందున దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు షేర్ ధర సానుకూలంగా కనిపిస్తోంది. కంపెనీ తన ఆదాయ వృద్ధిపై ఇటీవల విశ్వాసం వ్యక్తం చేసింది.

ఆర్డర్ బుక్ మెరుగుదల
లైవ్ మింట్‌ పోర్టల్ నివేదిక ప్రకారం, రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకురాలు సోనమ్ శ్రీవాస్తవ, టాటా కమ్యూనికేషన్స్ షేర్ ధర (Tata Communications Limited) యొక్క ఔట్‌లుక్‌పై స్పందించారు. టాటా కమ్యూనికేషన్స్ స్టాక్‌ (Tata Communications Limited)లో బలహీనత కారణంగా కంపెనీ పోస్ట్ చేసిన అంచనాల కంటే EBITDA వృద్ధి రేటు తక్కువగా ఉందని, ఇది 52 వారాల కనిష్ట స్థాయికి చేరిందని ఆయన అన్నారు.

మొత్తం మార్కెట్ బలహీనంగా ఉండటం కూడా కంపెనీ, టెలికాం రంగానికి క్షీణతకు ఒక కారణంగా  పేర్కొన్నారు. కంపెనీ ఆర్డర్ బుక్ మెరుగుపడినందున దాని దీర్ఘకాలిక అవకాశాల గురించి సానుకూలంగా ఉన్నామని అన్నారు. అలాగే, యాజమాన్యం వ్యాఖ్యలు కూడా ఆదాయంలో విజృంభణను సూచిస్తున్నాయి.

స్టాప్ లాస్ - రూ 730
టాటా కమ్యూనికేషన్స్ షేర్ (Tata Communications Limited) ప్రైస్ చార్ట్ ప్యాటర్న్‌లో – ఈ టాటా గ్రూప్ స్టాక్ దాని సపోర్ట్ జోన్‌కు దగ్గరగా ఉందని IIFL సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా తెలిపారు. పొజిషనల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇక్కడ మంచి కొనుగోలు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ స్టాక్‌ను ఈ రేటుతో కొనుగోలు చేయవచ్చని అన్నారు. స్టాప్ లాస్‌ను రూ.730 స్థాయిలో ఉంచి. స్వల్పకాలంలో రూ.820 స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.

జున్‌జున్‌వాలాకు 1.08 శాతం వాటా ఉంది
జనవరి నుండి మార్చి 2022 వరకు టాటా కమ్యూనికేషన్స్ (Tata Communications Limited) షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం, రాకేష్ జున్‌జున్‌వాలా తన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా ద్వారా ఈ టాటా గ్రూప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. రేఖా జున్‌జున్‌వాలా కంపెనీలో 30,75,687 షేర్లు లేదా 1.08 శాతం వాటాను కలిగి ఉన్నా

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?