86 శాతం మంది ఉద్యోగులు వచ్చే ఆరు నెలల్లో రాజీనామా చేయాలని చూస్తున్నారు: ఓ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Published : Jun 07, 2022, 10:54 AM ISTUpdated : Jun 07, 2022, 11:06 AM IST
86 శాతం మంది ఉద్యోగులు వచ్చే ఆరు నెలల్లో రాజీనామా చేయాలని చూస్తున్నారు: ఓ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

సారాంశం

ఎంప్లాయ్‌మెంట్ అండ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. భాతరదేశంలోని కంపెనీలలోని 86 శాతం మంది ఉద్యోగులు వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగానికి రాజీనామా యోచిస్తున్నారని పేర్కొంది. 

ఎంప్లాయ్‌మెంట్ అండ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. భాతరదేశంలోని కంపెనీలలోని 86 శాతం మంది ఉద్యోగులు వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగానికి రాజీనామా యోచిస్తున్నారని పేర్కొంది. భారతదేశంలోని 61 శాతం మంది ఉద్యోగులు.. తక్కువ వేతనాలను అంగీకరించడానికి సిద్దంగా ఉన్నారు. వీరు తమ మెరుగైన జీవితం కోసం ప్రమోషన్‌పై ఆధారపడే వ్యక్తులు. ‘‘మా డేటా ప్రకారం కరోనా కాలం నుంచి (గత రెండేళ్లుగా) రాజీనామాల ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఇది 2022లో చాలా వేగంగా ఉంటుంది’’ అని మైఖేల్ పేజ్ తన నివేదికలో పేర్కొంది. 

నివేదిక ప్రకారం.. ఈ ట్రెండ్ 2022లో అన్ని మార్కెట్లు, పరిశ్రమలు, సీనియర్లు, వివిధ వయసుల ఉద్యోగులలో కొనసాగుతుంది. ఇది తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం లేదు. రాబోయే కొద్ది నెలల్లో ప్రతిభావంతులు భారీగా వలసపోయే అవకాశం ఉంది. పని భారం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించడానికి ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఉద్యోగ ఔత్సాహికులకు కంపెనీ బ్రాండ్ ఇకపై ముఖ్యం కాదని.. వారు ఇప్పుడు సరైన విలువలు, సంస్కృతి ఉన్న కంపెనీలో తమకు నచ్చిన ఉద్యోగం కోసం చూస్తున్నారని కూడా నివేదిక పేర్కొంది. అయితే జీతాలు, బోనస్‌లు, రివార్డులు.. వంటి అంశాలు ఉద్యోగ బదిలీలో కీలక పాత్ర పోషించే అంశాలు. నివేదిక ప్రకారం.. అభ్యర్థులు ఇందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేదానిపై యజమానులు 29 శాతం అధికంగా అంచనా వేస్తున్నారు.


కంపెనీ పని ఏర్పాట్లు (హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైనవి..), కోవిడ్‌కు సంబంధించిన విధానాలు ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయని నివేదిక చూపుతోంది. రాజీనామా చేసిన లేదా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నవారిలో 11 శాతం మంది దీనిని మొదటి కారణంగా పేర్కొంటున్నారు. ఉద్యోగులు రాజీనామా చేయడానికి ప్రధాన కారణాలు కెరీర్ పురోగతి, అధిక జీతాలు, వారు పనిచేస్తున్న రోల్, పోస్ట్ మార్పులు, ఉద్యోగ సంతృప్తి

PREV
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?