రైడర్ల ఫేవరేట్.. రాజ్‌దూత్ 350 తిరిగి వచ్చేసింది: స్టైలిష్ లుక్ అదిరిపోయింది

Published : Dec 28, 2024, 12:16 PM IST
రైడర్ల ఫేవరేట్.. రాజ్‌దూత్ 350 తిరిగి వచ్చేసింది: స్టైలిష్ లుక్ అదిరిపోయింది

సారాంశం

మీరు పాత తరం మోటార్ సైకిళ్లంటే ఇష్టమా? అయితే మార్కెట్ లోకి తిరిగి వచ్చిన రాజ్‌దూత్ 350 మీరు కచ్చితంగా నచ్చుతుంది. ఇది శక్తివంతమైన ఇంజిన్, స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లతో భారతీయ మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్, బుల్లెట్ వంటి ప్రముఖ మోడళ్లతో పోటీ పడేందుకు ఐకానిక్ రాజ్‌దూత్ 350 బైక్ ఇండియన్ మార్కెట్లోకి తిరిగి వచ్చింది. శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో రాజ్‌దూత్ 350 బలమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

రాజ్‌దూత్ 350 బైక్

రాజ్‌దూత్ 350 బైక్ 348.44 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. ఇది అన్ని రకాల రోడ్లపై ప్రయాణించగలిగే విధంగా తయారు చేశారు. దీని ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఈ బైక్ గరిష్టంగా 23.99 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్

రాజ్‌దూత్ 350 లీటరు పెట్రోలుకు సుమారు 45.2 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకే కాకుండా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లేందుకు అనువుగా ఉంటుంది. 

ఆధునిక భద్రతా ఫీచర్లు

రాజ్‌దూత్ 350 బైక్ తయారీలో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్‌ని కలిగి ఉంది. ఇది క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్థిరమైన, సురక్షితమైన బ్రేకింగ్‌ను అందిస్తుంది. అందువల్ల బైక్ నడుపుతుంటే ఎలాంటి భయం ఉండదు. ముఖ్యంగా రోడ్డుపై జారిపోవడం, గుంతల్లో పడిపోవడం వంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది. 

డిజిటల్ ఫీచర్లు

రాజ్‌దూత్ 350లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, వంటి ముఖ్యమైన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంది. ఈ బైక్‌లో 4.49 అంగుళాల LED డిస్‌ప్లే ఉంది. ఇది వేగం, మైలేజ్, పనితీరు గురించి రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. అందువల్ల బైక్ నడిపే వారు ఎప్పటికప్పుడు ఈ స్మార్ట్ డిస్‌ప్లే ద్వారా బైక్ స్థితి గురించి తెలుసుకోవచ్చు. 

స్టైలిష్ డిజైన్

రాజ్‌దూత్ 350 బైక్ మోడరన్ లుక్ తో చాలా స్టైలిష్ గా ఉంది. బైక్ నడిపేటప్పుడు హుందాతనం కోరుకునే వారు ఈ మోటార్ సైకిల్ ని కచ్చితంగా ఇష్టపడతారు. 

బైక్ ధర

రూ.1,75,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో రాజ్‌దూత్ 350 ను మీరు సొంతం చేసుకోవచ్చు. దాని ఫీచర్లు, పనితీరును పరిగణనలోకి తీసుకుంటే దీని ధర తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే పోటీ కంపెనీలు ఇలాంటి ఫీచర్లు కలిగిన బైక్ లను మరింత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. మరిన్ని వివరాలు, టెస్ట్ రైడ్‌ల కోసం మీకు సమీపంలోని షోరూమ్‌ను సందర్శించండి.

రాజ్‌దూత్ 350 స్పెషల్

రాజ్‌దూత్ 350 పవర్, స్టైల్, అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఇది బైక్ లను ఇష్టపడే వారికి నచ్చే విధంగా ఆకర్షణీయమైన లుక్ ని కలిగి ఉంది. హైవేలపై దూసుకుపోవడానికి ఈ బైక్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అదేవిధంగా రోజూ వారీ పనుల కోసం కూడా ఈ బైక్ చాలా బాగుంటుంది. రాజ్‌దూత్ 350 పై ప్రయాణం మీకు ఉత్సాహాన్ని, సౌకర్యాన్ని అందిస్తుంది. 

 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు