వారికి గుడ్ న్యూస్ : ఈ-పాస్ ప్రారంభించిన రైల్వే బోర్డు ఛైర్మన్..

By Sandra Ashok KumarFirst Published Aug 13, 2020, 6:05 PM IST
Highlights

ఇప్పుడు రైల్వే అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుండైనా ఇ-పాస్ మరియు సువిదా టికెట్ ఆర్డర్ (పిటిఓ) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఆన్‌లైన్ పాస్ జనరేషన్, రైల్వే ఉద్యోగుల టికెట్ బుకింగ్ కోసం ఇ-పాస్ మాడ్యూల్‌ను విడుదల చేశారు. ఇప్పుడు రైల్వే అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుండైనా ఇ-పాస్ మరియు సువిదా టికెట్ ఆర్డర్ (పిటిఓ) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ఆన్‌లైన్‌లో పొందవచ్చు.


 రైల్వే ఉద్యోగుల ఆన్‌లైన్ పాస్ జనరేషన్, టికెట్ బుకింగ్ కోసం సెంటర్ ఫర్  రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(క్రిస్) ద్వారా అభివృద్ధి చేసిన హెచ్ఆర్ఎంఎస్ ప్రాజెక్ట్ కింద ఈ-పాస్ మాడ్యూల్‌ను వినోద్ కుమార్ యాదవ్ విడుదల చేశారు.

రైల్వే బోర్డు ఛైర్మన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా క్రిస్ అభివృద్ధి చేసిన మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్ఆర్ఎంఎస్) ఇ-పాస్ మాడ్యూల్‌ను ప్రారంభించింది. ట్రైన్ పాస్ సదుపాయం కోసం అంతకుముందు ఉద్యోగులు సంబంధిత  విభాగాన్ని సందర్శించాల్సి వచ్చేది.

కాగితపు ప్రక్రియలో, ట్రైన్ పాస్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు మొత్తం డేటా ఆన్‌లైన్‌లో అప్ డేట్ చేయబడుతుంది. ఈ వ్యవస్థ ఇ-పాస్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కొన్ని సెకన్లలో అధికారులు, ఉద్యోగులకు ఇస్తుంది.

also read 

ఈ సదుపాయం పొందిన తరువాత ఉద్యోగులు టికెట్ కౌంటర్ వెళ్ళి పాస్ తీసుకొవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొబైల్‌లోని కోడ్ మాత్రమే సేవ్ చేయాల్సి ఉంటుంది. సీటును రిజర్వ్ చేసేటప్పుడు ఈ కోడ్‌ను ఫారమ్‌లో నింపాలి.

అంతకుముందు రైల్వే ఉద్యోగులు రిజర్వేషన్ల కోసం సిబ్బంది శాఖతో సెక్షన్ నుంచి జారీ చేసిన పేపర్ పాస్‌తో పేపర్ టికెట్ తీసుకోవలసి వచ్చింది. కానీ ఇ-పాస్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో మొత్తం వ్యవస్థ పేపర్‌లెస్‌గా మారింది. ఇప్పుడు రైల్వే అధికారులు, ఉద్యోగులు సాధారణ పద్దతిలో ఇంట్లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 

గెజిటెడ్ అధికారులకు సంవత్సరంలో ఆరు, పదవీ విరమణపై మూడు రైలు పాసులు లభిస్తాయి. ఈ పాస్ ద్వారా అతను, అతని కుటుంబ సభ్యులు ఉచితంగ రైలులో ప్రయాణిస్తారు.

నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు సంవత్సరానికి మూడు పాసులు, పదవీ విరమణపై రెండు పాసులు ఇస్తారు. రైల్వే సిబ్బందికి నాలుగు పిటిఓ అంటే ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ కూడా లభిస్తుంది. పిటిఓ ద్వారా ప్రయాణించడానికి వారు మూడవ ఛార్జీ చెల్లించాలి. 

click me!