Latest Videos

ఆకట్టుకుంటున్న అంబానీ కోడలి డ్రెస్.. పార్టీలో అందరి చూపు ఆమె పైనే..

By Ashok kumar SandraFirst Published Jun 15, 2024, 1:21 PM IST
Highlights

రాధిక మర్చంట్ అనంత్ అంబానీ ప్రేమ లేఖ ప్రింటెడ్ గౌను అందరి దృష్టిని ఆకట్టుకుంది. తనకు 22 ఏళ్ల వయసులో అనంత్ అంబానీ ఈ లెటర్ ఇచ్చారని పార్టీలో రాధిక చెప్పారు.  

ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ రెండో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇటీవల జరిగిన సంగతి మీకు తెలిసిందే. అయితే ముకేశ్ అంబానీ ఈ పార్టీ  అతిథుల కోసం ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు ఓ ట్రిప్ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో వధూవరులు ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించగా, రాధికా మర్చంట్ గౌను హైలెట్ గా నిలిచింది... కారణం ఏంటి అనుకుంటున్నారా.. ? 

రాధిక మర్చంట్ అనంత్ అంబానీ ప్రేమ లేఖ ప్రింటెడ్ గౌను అందరి దృష్టిని ఆకట్టుకుంది. తనకు 22 ఏళ్ల వయసులో అనంత్ అంబానీ ఈ లెటర్ ఇచ్చారని పార్టీలో రాధిక చెప్పారు.  పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం అనంత్ ఈ ప్రేమలేఖ రాశారు. "నా  భవిష్యత్ తరాలకు ఇది కావాలి-నా పిల్లలకు, మనవళ్లకు దీనిని చూపించి, 'ఇది మా ప్రేమ' అని చెప్పాలనుకుంటున్నాను," అని రాధిక మర్చంట్  అన్నారు.

ఈ నాలుగు రోజుల వేడుకలో మొదటి రోజు రాధిక తెల్లటి షిఫాన్ గౌను ధరించింది. లండన్‌కు చెందిన డిజైనర్ రాబర్ట్ వున్ ఈ గౌనును డిజైన్ చేశారు. రెండవ రోజు పార్టీ కోసం  డిజైనర్ గ్రేస్ లింగ్ డిజైన్  చేసిన "టోగా"(toga)ని ధరించారు. నీతా అంబానీ ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్ షియాపరెల్లి గౌను ధరించి వచ్చారు.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12న జరగనుంది. ఆహ్వానం మేరకు పెళ్లితో పాటు మూడు రోజుల ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం జరగనుంది.

click me!