హైదరాబాద్‌, ముంబైలోని జీవీకే స్థావరాలపై ఈడీ సోదాలు..

By Sandra Ashok KumarFirst Published Jul 29, 2020, 11:57 AM IST
Highlights

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల మేరకు ముంబై, హైదరాబాద్‌లోని  తొమ్మిది ప్రాంగణాల్లోని కార్యాలయాలు, ఇండ్లపై  ఈ దాడులు జరిగాయని వారు తెలిపారు.

న్యూ ఢీల్లీ: జివికె గ్రూప్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎం‌ఐ‌ఏ‌ఎల్), ఇతరులపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం తనిఖీలు నిర్వహించింది.  

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల మేరకు ముంబై, హైదరాబాద్‌లోని  తొమ్మిది ప్రాంగణాల్లోని కార్యాలయాలు, ఇండ్లపై  ఈ దాడులు జరిగాయని వారు తెలిపారు.

also read రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతుల్లోకి బిగ్‌బజార్‌.. 27వేల కోట్లకు కొనుగోలు.. ...

ఈ చర్యలో భాగంగా జివికె గ్రూప్, ఎం‌ఐ‌ఏ‌ఎల్, జివికె గ్రూప్ ప్రమోటర్లకు చెందిన ప్రదేశాలను తనిఖీ చేసినట్లు వారు తెలిపారు. అదే సంస్థలపై ఇటీవల దాఖలు చేసిన సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ను అధ్యయనం చేసిన తరువాత సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ పిఎమ్‌ఎల్‌ఎ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదికను (పోలీసు ఎఫ్‌ఐఆర్‌కు సమానం) దాఖలు చేసింది.

ముంబై విమానాశ్రయ అభివృద్ధిలో రూ.705 కోట్ల అవకతవకలపై నిగ్గు తేల్చడానికి జీవీకే గ్రూపుతోపాటు ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లకు సంబంధించి ఈ దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  ప్రీవెంటివ్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 3 కింద ఈ తనిఖీలు చేపట్టారు. 

click me!