చైనాకు చుక్కలే..అమెరికాలో ప్రధాని మోడీ మెగా డీల్, భారత్‌లోనే F-414 ఫైటర్ జెట్ ఇంజన్ తయారీకి కుదిరిన ఒఫ్పందం

By Krishna Adithya  |  First Published Jun 22, 2023, 6:44 PM IST

 ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు.  హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), అమెరికన్  కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జిఇ) మధ్య భారతదేశంలో ఎఫ్ 414 జెట్ ఇంజిన్ తయారీ ఒప్పందం కుదరింది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం మన చిరకాల ప్రత్యర్థి చైనా వద్ద కూడా లేకపోవడం విశేషం. 


ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భారత వైమానిక దళానికి సంబంధించిన ఒక కీలక ఒప్పందం కుదిరింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో అమెరికాకు చెందిన జిఇ ఏరోస్పేస్ ఎంఒయుపై సంతకం చేసింది. భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను తయారు చేసేందుకు ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా, తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ MK2లో ఉపయోగించే GE ఏరోస్పేస్ F414 ఇంజన్లను దేశీయంగా ఉత్పత్తి చేసే వీలు కుదిరింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ వద్ద ఉంది. ఈ ఒప్పందం ద్వారా మన దేశానికి టెక్నాలజీ ట్రాన్స్ పర్ జరగనుంది. తద్వారా ఇరు దేశాల సంస్థలు అయిన HAL , GE ఏరోస్పేస్ కలిసి ఈ ఇంజిన్‌ను తయారు చేసే వీలు కలుగుతుంది. 

HAL , GE ఏరోస్పేస్ కలిసి F414 ఇంజిన్‌లను తయారు చేస్తాయి
GE ఏరోస్పేస్ , మాతృ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ అధికారిక ప్రెస్ నోట్ ప్రకారం, ఈ ఒప్పందం భారతదేశంలో GE ఏరోస్పేస్, F414 ఇంజిన్ ఉమ్మడి ఉత్పత్తి చేసేందుకు వీలు కల్పిస్తుంది. దీనికి అవసరమైన ఎగుమతి అనుమతులను పొందేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు US కంపెనీ తెలిపింది. తేజస్ LCA Mk2 ప్రోగ్రామ్‌లో భాగంగా భారత వైమానిక దళం కోసం 99 ఇంజిన్‌లను రూపొందించడానికి GE ఏరోస్పేస్ తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. 
 
ఈ ఒఫ్పందం సందర్భంగా ప్రధానమంత్రి GE సంస్థ CEOని కలిశారు, ఈ అవగాహన ఒప్పందానికి ముందు, ఈరోజు ప్రధాని మోడీ GE ఏరోస్పేస్ సీఈవో లారెన్స్ కల్ప్ జూనియర్‌ని కలిశారు. భారతదేశంలో తయారీని పెంచడానికి GE సాంకేతిక సహకారంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. భారతదేశంలో విమానయానం, రిన్యువబుల్ ఎనర్జీ రంగాలలో పెద్ద పాత్ర పోషించాలని కంపెనీని ప్రధాని మోడీ ఆహ్వానించారు.

Latest Videos

40 ఏళ్లుగా భారత్‌తో కలిసి పనిచేస్తున్న కంపెనీ
జనరల్ ఎలక్ట్రిక్ , GE ఏరోస్పేస్ ఇప్పటికే భారత వైమానిక దళానికి పరికరాలను సరఫరా చేసింది. కంపెనీ గత 40 ఏళ్లుగా భారత్‌తో కలిసి పనిచేస్తోంది. ఇప్పటివరకు కంపెనీ ఏవియానిక్స్, ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ , లోకల్ సోర్సింగ్ రంగంలో భారత్‌తో కలిసి పనిచేస్తోంది. కంపెనీ ఇప్పటి వరకు మొత్తం 75, ఎఫ్ 404 ఇంజన్‌లను డెలివరీ చేసింది. LCA Mk1A కోసం 99 ఇంజిన్‌లు ఆర్డర్‌లో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ భారతదేశంలో F414 ఫైటర్ జెట్ ఇంజిన్‌ను తయారు చేయనుంది. ఇదిలా ఉంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్ ధర గురువారం 1.45 శాతం తగ్గి రూ.3763.70 వద్ద ముగిసింది. 

చైనాకు చెక్ పెట్టిన భారత్
ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని దేశాలు మాత్రమే ఎఫ్ 414 జెట్ ఇంజన్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి. ఇందులో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి. చాలా కాలంగా ఈ టెక్నాలజీని ఇతర దేశాలతో కలిసి పంచుకోవాలని భారత్ భావించినప్పటికీ, చాలా దేశాలు ఈ విషయంపై నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితిలో, భారత్, యుఎస్ మధ్య F414 ఒప్పందం వ్యూహాత్మకంగా  ముఖ్యమైనది మాత్రమే కాదు, చారిత్రకమైనది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం చైనా, పాకిస్థాన్ వద్ద కూడా లేకపోవడం విశేషం. 

click me!