నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్‌: వడ్డీరేటు, లాభాలేంటి?

By rajesh yFirst Published Apr 15, 2019, 12:07 PM IST
Highlights

దేశీయ పోస్టల్ సిస్టమ్ ఇండియా పోస్ట్ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టు దేశ ప్రజలకు వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు దేశంలోని 1.5లక్షల పోస్ట్ ఆఫీసులు  పనిచేస్తున్నాయి. 

దేశీయ పోస్టల్ సిస్టమ్ ఇండియా పోస్ట్ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టు దేశ ప్రజలకు వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు దేశంలోని 1.5లక్షల పోస్ట్ ఆఫీసులు  పనిచేస్తున్నాయి. 

పేద, మధ్య తరగతి ప్రజలకు అనేక పొదుపు పథకాలను అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు కూడా ఆశించిన స్థాయిలో ఉంటున్నాయి. ఇప్పుడు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ అనే పొదుపు పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ పథకానికి సంబంధించి indiapost.gov.in. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్(ఎన్ఎస్‌సీ):

1. అర్హత: ఇది సింగిల్ హోల్డర్ సర్టిఫికేట్. యువతి లేదా యువకుడు వారి కోసం లేదా మైనర్ తరపున లేదా మైనర్(కోసం) ఈ పథకాన్ని కొనుగోలు చేయవచ్చు.

2. మొత్తం: నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్(ఎన్ఎస్‌సీ) ఖాతా ఓపెన్ చేసేందుకు కనీసం రూ. 100 అవసరం. రూ.100 మల్టిపుల్ మొత్తాలను జమ చేసుకోవచ్చు. గరిష్ట కొనుగోలుకు పరిమితి లేదు.

3. వడ్డీరేటు: ఎన్ఎస్‌సీ 8శాతం(వార్షిక కాంపౌండ్) రిటర్న్ అందజేస్తోంది. అయితే, ఇది  మాచురిటీ తీరిన తర్వాతే పొందే అవకాశం ఉంది. ఐదేళ్ల మాచురిటీ తీరిన తర్వాత రూ. 100 ఎన్ఎస్‌సీకి రూ.146.93 పొందవచ్చని ఇండియా పోస్ట్ పేర్కొంది. 

4. ఆదాయపుపన్ను లాభాలు: నేషనల్ సేవింగ్స్ సెర్టిఫికేట్స్ డిపాజిట్లు   ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80సీ కింద డిడక్షన్ గుర్తింపబడింది. రూ. 1,00,000 వరకు 80సీ ఆదాయ పన్ను మినహాయింపు. మెచూరిటీ 5ఏళ్లు లేదా 10ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ఎటువంటి పన్ను మినహాయింపు లేదు కానీ, వడ్డీని తిరిగి వాటిలోనే పెట్టుబడి పెట్టినట్లయితే రూ. లక్షల మినహాయింపులో అది కూడా చేరుతుంది.

5. సర్టిఫికేట్స్ బదిలీ: సర్టిఫికేట్స్ ఒకరి నుంచి మరొకరికి మార్చే సమయంలో పాత సర్టిఫికేట్స్ తొలగించబడదు. హోల్డ్ పేరు రౌండ్ చేసి కొత్త హోల్డర్ పేరును ఆ స్థానంలో చేర్చడం జరుగుతుంది.

click me!