PMSBY: ఏడాదికి రూ. 12 చెల్లిస్తే.. రూ.2 లక్షలు భీమా.. ఎలా అప్లై చేయాలంటే..

Published : Dec 14, 2021, 01:06 PM ISTUpdated : Dec 14, 2021, 01:12 PM IST
PMSBY:  ఏడాదికి రూ. 12  చెల్లిస్తే.. రూ.2 లక్షలు భీమా.. ఎలా అప్లై చేయాలంటే..

సారాంశం

ప్రస్తుత కాలంలో బీమా (Bima) పొందడం అనేది అంత తేలికైన పని కాదనే చెప్పాలి. కానీ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana) గురించి తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇందుకోసం ఏడాదికి రూ. 12 చెల్లిస్తే సరిపోతుంది. ఆ ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..  

ప్రస్తుత కాలంలో బీమా పొందడం అనేది అంత తేలికైన పని కాదనే చెప్పాలి. బీమా పొందాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు బీమా అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్రైవేటు కంపెనీల్లో ప్రీమియం రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని భరించడం సాధారణ ప్రజలకు అంత సులభమైన పని కాదు. కానీ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana) గురించి తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ స్కీమ్ కింద ప్రమాదవశాత్తు మరణం, వైకల్యానికి సంబంధించి బీమాను అందజేస్తారు. కేవలం ఏడాది రూ. 12తో ఈ బీమా పొందవచ్చు.

ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారంటే..
PMSBY అనేది ఒక రకమైన ప్రమాద బీమా పాలసీ. దీనిని ప్రమాద సమయంలో మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 వార్షిక బడ్జెట్‌లో ఫిబ్రవరి 28, 2015న ప్రకటించారు. జీవిత బీమా లేని భారతదేశంలోని భారీ జనాభాకు రక్షణ బీమా కల్పించడం ఈ పథకం ఉద్దేశం. వార్షిక ప్రీమియం రూ.12తో ఈ భీమాను పొందవచ్చు. ఈ పథకం 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది.

ఎంత మొత్తం చెల్లిస్తారు..
ఈ పథకం కింద బీమా తీసుకునే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు 2 లక్షలు బీమా అందజేస్తారు. ప్రమాదంలో రెండు కళ్లు లేదా రెండు చేతులు లేదా రెండు కాళ్లు దెబ్బతిన్నట్లయితే కూడా రెండు లక్షలు రూపాయలు పొందవచ్చు. మరణం, పూర్తి వైకల్యం సంభవించిన రూ. 2 లక్షలు, పాక్షిక వైకల్యం ఏర్పడితే.. రూ.  లక్ష బీమా మొత్తాన్ని అందించే నిబంధన ఉంది.

పథకానికి అర్హులు ఎవరంటే..
18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ బీమా యోజనలో చేరిన తర్వాత సంవత్సరానికి రూ. 12 మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించాలి. ఈ బీమా ఒక సంవత్సరం కవర్ చేస్తుంది. ప్రతి సంవత్సరం దీనిని పునరుద్దరించుకోవాలి. ఈ పథకంలో చేరేటప్పుడు బ్యాంకు ఖాతాలో ఆటో డెబిట్ ప్రారంభించడానికి సమ్మతి ఇవ్వడం తప్పనిసరి.

తప్పనిసరిగా ఉండాల్సినవి..
18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. బీమా పథకంలో చేరాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఒక చందాదారుడు 1 లేదా అంతకంటే ఎక్కువ పొదుపు ఖాతాలను కలిగి ఉంటే.. ఏదైనా ఒక పొదుపు ఖాతా ద్వారా పథకంలో చేరవచ్చు.

ఈ బీమా యోజనలో చేరాలంటే..
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనలో భాగం కావడానికి.. దరఖాస్తుదారు ముందుగా తన ఆధార్ కార్డ్‌ని బ్యాంక్‌తో లింక్ చేయాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జూన్ 1కి ముందు ఒక ఫారమ్ నింపి సంబంధిత బ్యాంకు అధికారులకు ఇవ్వాలి. ఉమ్మడి ఖాతా కలిగి ఉంటే.. ఆ అకౌంట్ కలిగిని ఖాతాదారులందరూ ఈ పథకంలో చేరవచ్చు. 

ప్రీమియం చెల్లింపు..
ఈ పథకం కోసంసంవత్సరానికి రూ. 12 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకు ద్వారా నేరుగా ఖాతా నుండి తీసివేయబడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి..
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కింద నమోదు చేసుకోవడానికి.. ఖాతాదారుడు పొదుపు ఖాతా ఉన్న తన బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయానికి లాగిన్ అవ్వాలి. లేదా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. ఒక వ్యక్తి.. ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రయోజనాన్ని పొందవచ్చు. 

ఈ పథకం జూన్ 1 నుంచి మే 31 వరకు ఒక సంవత్సరం కాలపరిమితిని కలిగి ఉంది. దీనిని ప్రతి సంవత్సరం బ్యాంకు ద్వారా పునరుద్ధరించబడాలి. స్కీమ్‌లోని ప్రీమియం మొత్తం అన్ని పన్నులతో సహా సంవత్సరానికి రూపాయలు. ఇది ఆటో-డెబిట్ సేవ ద్వారా ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన లేదా అంతకు ముందు బీమా చేసిన వ్యక్తి ఖాతా నుండి డెబిట్ అవుతాయి.

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు