petrol diesel price:పెట్రోల్ డీజిల్ తాజా ధరలు.. నేడు మీ నగరంలో తగ్గింద పెరిగిందా తెలుసుకోండి ?

Ashok Kumar   | Asianet News
Published : Dec 11, 2021, 11:48 AM IST
petrol diesel price:పెట్రోల్  డీజిల్  తాజా ధరలు.. నేడు మీ నగరంలో  తగ్గింద పెరిగిందా తెలుసుకోండి ?

సారాంశం

నేడు వరుసగా పదో రోజు  పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గత వారం, కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో పెట్రోల్ ధరను రూ. 8.56 తగ్గించింది, అయితే డీజిల్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. 

బెంగళూరు: అక్టోబర్ నుంచి వాహనదారులను బెంబేలెత్తిస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు గత నెల రోజులుగా నిలకడగా ఉన్నాయి. నిత్యం హెచ్చుతగ్గులకు లోనవుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలకు ఆందోళన కలిగించగా కొన్ని రాష్ట్రాల్లో  ఇప్పటికి పెట్రోల్ ధర రూ.100 పైగా ఉంది.

 గత నెల దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని  తగ్గించగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా  దిగోచ్చాయి. ఆ తర్వాత నుండి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం గత మంగళవారం పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గింపును ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు అధికంగా మారాయి.

దీంతో భవిష్యత్తులో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రంలో గత 38 రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి.  ప్రభుత్వ చమురు కంపెనీల ప్రకారం  డిసెంబర్ 11 శనివారం ఈరోజున పెట్రోల్-డీజిల్ ధరలు  స్థిరంగా ఉన్నాయి. IOCL వెబ్‌సైట్ ప్రకారం ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 95.41 కాగా, డీజిల్ లీటరుకు రూ. 86.67గా అమ్ముడవుతోంది.


 ముంబైలో పెట్రోల్ రూ. 109.98 మరియు డీజిల్ లీటరు రూ. 94.14.
 చెన్నైలో లీటరు పెట్రోల్ రూ.101.40 మరియు డీజిల్ రూ.91.43.
 కోల్‌కతాలో పెట్రోల్ రూ.104.67 మరియు డీజిల్ లీటరుకు రూ.89.79.
 లక్నోలో పెట్రోల్ రూ. 95.28 మరియు డీజిల్ లీటర్ రూ. 86.80.
  గాంధీనగర్‌లో పెట్రోల్‌ రూ.95.35, డీజిల్‌ లీటరు రూ.89.33గా ఉంది.
 పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ రూ. 82.96 మరియు డీజిల్ లీటరుకు రూ.77.13.
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20, డీజిల్ ధర లీటరుకు రూ.94.62

పెట్రో ధరల సవరణ ఎలా?
పెట్రోల్, డీజిల్ ధరలలో చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. మొదటిది ముడి చమురు ధర, రెండోది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు. డీలర్స్ కమీషన్ అలాగే VAT  ధర ద్వారా ప్రభావితమవుతుంది.  గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్ ధరలు మారేవి. 

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు