ప్రతి ఒక్క భారతీయుడికి కరోనా వ్యాక్సిన్ లభిస్తుంది: ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన

By Sandra Ashok KumarFirst Published Oct 29, 2020, 3:09 PM IST
Highlights

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రతి పౌరుడికి అందజేస్తామని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షల మందికి ఈ కరోనా వైరస్ సోకింది.

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి గురువారం ప్రధాని నరేంద్ర మోడీ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రతి పౌరుడికి అందజేస్తామని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

దేశంలో ఇప్పటి వరకు 80 లక్షల మందికి ఈ కరోనా వైరస్ సోకింది. స్వదేశంలో అలాగే విదేశాలలో అనేక వ్యాక్సిన్లపై ట్రయల్స్ జరుగుతున్నాయి.  ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ ప్రకటన ఎంతో కీలకం సంతరించుకుంది.

ఒక ఆంగ్ల వార్తాపత్రికతో సంభాషణలో కరోనా వ్యాక్సిన్ గురించి ప్రధాని చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, 'దేశంలో కరోనా వ్యాక్సిన్ లభించిన వెంటనే అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని, దీని ద్వారా ప్రజలకి, దేశానికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. కోవిడ్ -19 వ్యాక్సిన్ నిల్వ చేయడానికి కోల్డ్ చైన్ కూడా పురోగతిలో ఉంది.

also read అంత‌ర్జాతీయ విమానాల‌పై మ‌ళ్లీ బ్యాన్... నవంబర్ 30 వరకు నిషేధాన్ని పొడిగిస్తు ప్రకటన.. ...

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి భారత ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకుందని, డాక్టర్లు, పారిశుద్ద కార్మికులు, పోలీసులు మరికొంత మంది సిబ్బంది సహాయంతో చాలా మంది ప్రాణాలు కాపాడగలిగామని  ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

లాక్‌డౌన్‌ను విధించినప్పటినుంచి అన్‌లాక్ ప్రాసెస్‌లోకి వెళ్ళే సమయం పూర్తిగా సరైనది. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోందని ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. పండుగ రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. విశ్రాంతి తీసుకోవడానికి ఇది అవకాశం కాదు అని అన్నారు.

ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ప్రచారం చేపట్టవచ్చు. ప్రధాని మోడీ మాట్లాడుతూ 'కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం నుండి ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని, ఈ వ్యాక్సిన్ ప్రచారం ప్రారంభంలో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు, కరోనాపై యుద్ధం చేస్తున్న ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉంటారు.

 కరోనా వ్యాక్సిన్ లభ్యత గురించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, తద్వారా సమయం వచ్చినప్పుడు వ్యాక్సిన్ దేశం మొత్తంలో అందించబడుతుంది. ఒక అంచనా ప్రకారం కరోనా వ్యాక్సిన్లు అందించడానికి ప్రభుత్వం మొదట్లో 50 వేల కోట్ల బడ్జెట్‌ను నిర్ణయించినట్లు సమాచారం.

click me!