'ప్రకృతి ప్రేమికుడు' ప్రధాని నరేంద్ర మోడీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..

By Sandra Ashok KumarFirst Published Oct 31, 2020, 1:01 PM IST
Highlights

అక్కడ నరేంద్ర మోడీ  కొన్ని పక్షులకు, రకరకాల చిలుకలకు తినడానికి ధాన్యలను అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని ట్విట్టర్ హ్యాండిల్, అతని అభిమానులు, ఫాలోవర్స్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కెవాడియాలోని జంగిల్ సఫారిని శుక్రవారం సందర్శించారు. అక్కడ నరేంద్ర మోడీ  కొన్ని పక్షులకు, రకరకాల చిలుకలకు తినడానికి ధాన్యలను అందించాడు.

దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని ట్విట్టర్ హ్యాండిల్, అతని అభిమానులు, ఫాలోవర్స్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీ ప్రకృతి ప్రేమను చాలా మంది ప్రశంసించారు. మరికొందరు కామెంట్లతో అభినందించారు.

అడవిలోని పక్షులను సహజ వాతావరణంలో చూడటం ప్రధాని ఇష్టపడతారు అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి, తక్కువ సమయంలోనే వేలాది లైక్స్, కామెంట్స్ వచ్చాయి.

ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఉన్న గుజరాత్ రాష్ట్రం పర్యాటకులను ఆకర్షించడానికి అనేక కొత్త టూరిజం ప్రదేశాలను ప్రారంభించింది.

also read 

 గుజరాత్‌లోని నర్మదా జిల్లా కెవాడియాలోని "స్టాట్యూ ఆఫ్ యూనిటీ" సమీపంలో కొత్తగా నిర్మించిన జంగిల్ సఫారి ఫారెస్ట్, ఏక్తా మాల్ ను ప్రధాని శుక్రవారం ప్రారంభించారు.

ఈ ఫారెస్ట్ లోని 15 ఎకరాలలో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. ఇందులో 380 జాతుల ఐదు లక్షల చెట్లు ఉన్నాయి. ఆయుర్వేదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఫారెస్ట్ ని అభివృద్ధి చేశారు.

గుజరాత్‌ గవర్నర్ ఆచార్య దేవ్రాత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీలతో పాటు నరేంద్ర మోడీ ఈ ఫారెస్ట్ సందర్శించారు. ఏక్తా మాల్‌ భారతదేశంలోని హస్తకళలు, సాంప్రదాయ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది.

ఏక్తా మాల్ 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ మాల్‌లో 20 ఎంపోరియంలు ఉన్నాయి, ఏక్తా మాల్ ను కేవలం 110 రోజుల్లోనే నిర్మించారు.

click me!