నవంబరులో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి..

By Sandra Ashok KumarFirst Published Oct 30, 2020, 5:04 PM IST
Highlights

నవంబర్ నెలలో దీపావళి, ఛత్ పూజతో సహా వివిధ పండుగల కారణంగా బ్యాంకులకు అధికారిక హాలిడే ప్రకటించారు. బ్యాంకుల సెలవులు వివిధ రాష్ట్రాలకి అనుగుణంగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల స్థానిక పండుగలా కారణంగా కూడా బ్యాంకులు మూసివేయబడతాయి.

దసరా, దీపావళి పండుగ సీజన్ రావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు  భారీగా సెలవులు రానున్నాయి. నవంబర్ నెలలో దీపావళి, ఛత్ పూజతో సహా వివిధ పండుగల కారణంగా బ్యాంకులకు అధికారిక హాలిడే ప్రకటించారు.

బ్యాంకుల సెలవులు వివిధ రాష్ట్రాలకి అనుగుణంగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల స్థానిక పండుగలా కారణంగా కూడా బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ సెలవుల కారణంగా బ్యాంకులు నవంబర్ నెలలో ఎక్కువ రోజులు పనిచేయవు.

ఒక్క నవంబర్ నెలలోనే బ్యాంకులకు సుమారు 15 రోజులు సెలవులు రానున్నాయి. ఇందులో రెండో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయి.

మీరు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని నవంబర్ నెలలో పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే, ఏ రోజుల్లో ఎక్కడ బ్యాంకులు మూసివేసి ఉంటాయి, ఏ రోజుల్లో ఎక్కడ బ్యాంకులు తెరుచుకుంటాయో తెలుసుకోవడం మంచిది.  

also read పేటీఎంలో చైనా పెట్టుబ‌డులు.. ప్ర‌శ్నించిన పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్‌.. ...

నవంబరులో బ్యాంకుల హాలిడేలు 

నవంబర్ 1 - ఆదివారం (ప్రతిచోటా, వీకెండ్ హాలిడే)
నవంబర్ 8 - ఆదివారం (ప్రతిచోటా, వీకెండ్ హాలిడే)
నవంబర్ 14 - దీపావళి అమావాస్య (లక్ష్మి పూజన్), కాశీ పూజ
నవంబర్ 15 - ఆదివారం (ప్రతిచోటా, వీకెండ్ హాలిడే)
నవంబర్ 16 - దీపావళి, లక్ష్మీ పూజ, భాయుడుజ్, చిత్రగుప్తా జయంతి, నూతన సంవత్సర దినోత్సవం
20 నవంబర్- చాత్ పూజ (బీహార్ రాజధాని పాట్నా మరియు రాంచీ)
21 నవంబర్- చాత్ పూజ (బీహార్ రాజధాని పాట్నా)
22 నవంబర్- ఆదివారం (ప్రతిచోటా, వీకెండ్ హాలిడే)
28 నవంబర్- నాల్గవ శనివారం (ప్రతిచోటా, వీకెండ్ హాలిడే)
నవంబర్ 29- ఆదివారం (ప్రతిచోటా, వీకెండ్ హాలిడే)
నవంబర్ 30- గురు నానక్ జయంతి / కార్తీక్ పూర్ణిమ

పై జాబితా ప్రకారం నవంబర్ 14న అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, చండీఘడ్, చెన్నై, డెహ్రాడూన్, గువహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కొచ్చి, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, న్యూ ఢీల్లీ, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులకు హాలిడే.

అలాగే నవంబర్ 16న అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, గాంగ్టక్, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్పూర్ లలో బ్యాంకులకు హాలిడే. ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, డెహ్రాడూన్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢీల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీన్, సిమ్లాలో నవంబర్ 30న బ్యాంకులకు హాలిడే.

click me!