ఐబీఎంకు ప్రధాని మోదీ ఆఫర్‌.. పెట్టుబడులు పెట్టడానికి ఇదే గొప్ప సమయం..

By Sandra Ashok KumarFirst Published Jul 21, 2020, 11:30 AM IST
Highlights

 టెక్ రంగంలో జరుగుతున్న పెట్టుబడులను దేశం స్వాగతించి, సహకారం ఇస్తోందని మోదీ అన్నారు. ప్రపంచం ఆర్ధిక మందగమనంలో ఉండగా, భారతదేశంలో ఎఫ్‌డిఐ(ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్)ల ప్రవాహం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

న్యూ ఢీల్లీ: భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది గొప్ప సమయం అని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐబిఎం సీఈఓ శ్రీ అరవింద్ కృష్ణతో అన్నారు. టెక్ రంగంలో జరుగుతున్న పెట్టుబడులను దేశం స్వాగతించి, సహకారం ఇస్తోందని మోదీ అన్నారు.

ప్రపంచం ఆర్ధిక మందగమనంలో ఉండగా, భారతదేశంలో ఎఫ్‌డిఐ(ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్)ల ప్రవాహం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పోటీపడేందుకు, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు ఎదురైనా ఇబ్బందిపడే పరిస్థితి రాకుండా చూసుకునేందుకు భారత్‌ స్వయం సమృద్ధి సాధించే దిశగా పురోగమిస్తోందని ఆయన పేర్కొన్నారు.

భారతదేశంలో ఐబిఎం సంస్థ భారీ పెట్టుబడి ప్రణాళికల గురించి ఐబిఎం సిఇఒ నరేంద్ర మోడీకి వివరించారు. ఆత్మనీర్భర్ భారత్ దృష్టిపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఐబిఎం గ్లోబల్ హెడ్‌గా పదవి బాద్యతలు చేపట్టిన అరవింద్ కృష్ణని ప్రాధాని మోడీ అభినందించారు.

వ్యాపార సంస్కృతిపై కోవిడ్-19 ప్రభావం గురించి ప్రధాని మాట్లాడుతూ, ‘వర్క్ ఫ్రోం హోం’ పెద్ద ఎత్తున అవలంబిస్తున్నదని, ఈ సాంకేతిక మార్పు సజావుగా ఉండేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, నియంత్రణ వాతావరణాన్ని అందించే దిశగా నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.

also read ఇండిగో బాధాకరమైన నిర్ణయం..చరిత్రలోనే తొలిసారి : సీఈఓ ...

ఐబిఎం కంపెనీ 75% మంది ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలన్న నిర్ణయానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, సవాళ్ళ గురించి కూడా ఆయన చర్చించారు. భారతదేశంలోని 200 పాఠశాలల్లో ఏ‌ఐ(ఆటోమేటిక్ ఇంటెల్లిజెన్స్) పాఠ్యాంశాలను ప్రారంభించటానికి సిబిఎస్‌ఇ సహకారంతో ఐబిఎం పాత్రను ప్రధాని ప్రశంసించారు.

దేశంలో టెక్ స్వభావాన్ని మరింత పెంచడానికి, ప్రారంభ దశలో ఏ‌ఐ, మెషిన్ లెర్నింగ్ వంటి భావనలకు విద్యార్థులను పరిచయం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. టెక్నాలజీ, డేటా గురించి బోధన వంటి ప్రాథమిక నైపుణ్యాల విభాగంలో ఉండాలి, అభిరుచితో బోధించాల్సిన అవసరం ఉందని, ముందుగానే ప్రవేశపెట్టాలని ఐబిఎం సిఇఓ అన్నారు.

వైద్యను  ప్రోత్సహించడానికి, ఉత్తమమైన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ప్రజలకు అందుబాటులో ఉండేలా గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి మోడీ మాట్లాడారు. ప్రజలకు సరసమైన, ఇబ్బంది లేని ఇంటిగ్రేటెడ్, టెక్, డేటా ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధి దిశగా దేశం కదులుతోందని ఆయన చెప్పారు.

ఆరోగ్య సంరక్షణ దృష్టిని ముందుకు తీసుకెళ్లడంలో ఐబిఎం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ కోసం ప్రధాన మంత్రి దృష్టిని ఐబిఎం సిఇఒ ప్రశంసించారు. వ్యాధులను ముందుగా గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి కూడా మాట్లాడారు.

click me!