భారత్‌కు రండి.. మీకోసం బ్రిడ్జిలా పనిచేస్తా: పారిశ్రామికవేత్తలకు మోడీ భరోసా

By Siva KodatiFirst Published Sep 25, 2019, 8:20 PM IST
Highlights

పెట్టుబడులకు అనుకూలమైన మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నవారు భారత్‌ రావాలని మోడీ పిలుపునిచ్చారు. భారత్‌లోని నగరాలను ఆధునీకరిస్తున్నామని ఇంతకుముందెన్నడూ లేని విధంగా రక్షణ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించామని ప్రధాని వెల్లడించారు. 

న్యూయార్క్‌లో బ్లూమ్‌బెర్గ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ ఫోరం-2019 కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పెట్టుబడులకు అనుకూలమైన మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నవారు భారత్‌ రావాలని మోడీ పిలుపునిచ్చారు.

భారత్‌లోని నగరాలను ఆధునీకరిస్తున్నామని ఇంతకుముందెన్నడూ లేని విధంగా రక్షణ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించామని ప్రధాని వెల్లడించారు. సులభతర వాణిజ్యం కోసం సుమారు 50 చట్టాలను రద్దు చేశామని మోడీ వివరించారు.

ప్రస్తుతం భారత్‌లో వ్యాపారాన్ని గౌరవించే, సంపదను సృష్టిని ప్రోత్సహించే ప్రభుత్వం ఉందన్నారు. 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుందని మోడీ వివరించారు.

గత ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని.. అంతకుముందు 20 ఏళ్లతో పోల్చినప్పుడు దాదాపు సగమని ప్రధాని పేర్కొన్నారు.

వ్యాపారవేత్తలకు తాను ఒక బ్రిడ్జిలా వ్యవహరిస్తానని ప్రధాని భరోసా ఇచ్చారు. ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించి తమ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మోడీ గుర్తు చేశారు. 
 

click me!