PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే 11 విడత పీఎం కిసాన్ డబ్బులు రూ.2000 మీ అకౌంట్లో పడవు..

Published : Mar 16, 2022, 01:32 PM IST
PM Kisan: రైతులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే 11 విడత పీఎం కిసాన్ డబ్బులు రూ.2000 మీ అకౌంట్లో పడవు..

సారాంశం

PM Kisan: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏటా రైతుల ఖాతాలో రూ.6000 జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ రైతులకు 10 విడతల్లో డబ్బులు జమ అయ్యాయి. కానీ 11 విడతకు మాత్రం ఈ-కెవైసీ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ-కెవైసీని ఎలా చేయాలో తెలుసుకుందాం. 

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) కింద, ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలో రైతుల బ్యాంకు ఖాతాలో 11వ విడతగా 2000 రూపాయలను బదిలీ చేయనుంది. అయితే పీఎం కిసాన్ యోజన 11వ విడత డబ్బు పొందాలంటే రైతులు తప్పనిసరిగా  ఈ-కేవైసీ (eKYC) చేయాల్సి ఉంటుంది. eKYC చేసిన  రైతుల ఖాతాల్లోకే డబ్బు జమ చేయబడుతుంది. ఈ షరతు పాటించని రైతులకు డబ్బులు అందడం లేదు.

ఇప్పటి వరకు 10 వాయిదాల్లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద డబ్బులు అందించింది. చివరి సారిగా 10వ విడత డబ్బు జనవరి 1, 2022న రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడింది. మొత్తం 10.09 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.20,900 కోట్లు జమ అయ్యాయి.

e-KYC పూర్తి చేయడం తప్పనిసరి (e-kyc for PM Kisan Samman Nidhi Yojana ) 
మోదీ ప్రభుత్వం  రైతులందరికీ e-KYC (PM Kisan Samman Nidhi Yojana) తప్పనిసరి చేసింది. 11విడత డబ్బుల కోసం  మరోసారి eKYC అవసరం ఏర్పడింది. ఈ ముఖ్యమైన పనిని మీ మొబైల్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లో  కూడా సులభంగా చేయవచ్చు.

రేషన్ కార్డు తప్పనిసరి
ప్రభుత్వం చేసిన ప్రధాన మార్పుల ప్రకారం, ఇప్పుడు ఈ పథకం కోసం కొత్త రిజిస్ట్రేషన్‌పై రేషన్ కార్డ్ నంబర్ ఇవ్వడం కూడా తప్పనిసరి. ఇది కాకుండా రేషన్ కార్డు PDF కాపీని కూడా ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కొత్త రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పట్టాపాస్ బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ , డిక్లరేషన్ ఫారమ్  హార్డ్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. 

ఇలా e-KYCని పూర్తి చేయండి
>> PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ని సందర్శించండి.
>> ఇప్పుడు eKYC లింక్ కిసాన్ కార్నర్ ఎంపికలో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
>> ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.
>> ఆ తర్వాత ఇక్కడ అడిగిన అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.
>> దీని తర్వాత Submitపై క్లిక్ చేయడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది.
 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు