bank holidays: ఈ తేదీల్లో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు బంద్.. హోలీ రోజున స్టాక్ మార్కెట్ హాలిడే..

Ashok Kumar   | Asianet News
Published : Mar 16, 2022, 01:22 PM IST
bank holidays: ఈ తేదీల్లో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు బంద్..  హోలీ రోజున స్టాక్ మార్కెట్ హాలిడే..

సారాంశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, హోలీ సందర్భంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకుల్లో పని ఉండదు. తేదీలను బట్టి చూస్తే మార్చి 17, 18, 19, 20 తేదీల్లో బ్యాంకులకు సెలవు. దీంతో పాటు హోలీ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు కూడా ఉంటుంది.    

ఈ మధ్య కాలంలో బ్యాంకుకు సంబంధించి ఏదైనా  పని ఉంటే హోలీకి ముందు చేస్తే ప్రయోజనం ఉంటుంది.  ఎందుకంటే ఈ వారం బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసివేయబడనున్నయి. ఈ వారంలో హోలీ పండుగ కారణంగా బ్యాంకు కార్యకలాపాలల్లో   వర్కింగ్ ఉండదు దీంతో పాటు మార్చి 17, 18, 19, 20 తేదీలలో బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ సెలవుల్లో ఆదివారం సెలవు కూడా ఉంది. ఆర్‌బి‌ఐ వెబ్‌సైట్ ప్రకారం, మార్చి నెలలో మొత్తం 13 సెలవులు ఉన్నాయి, వాటిలో నాలుగు వరుసగా ఈ వారంలో రానున్నాయి.

ఈ రాష్ట్రాలలో సెలవులు మారుతూ ఉంటాయి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి హాలిడేస్  జాబితాలో చాలా రోజుల పాటు బ్యాంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, కస్టమర్లు ఆన్‌లైన్ మోడ్‌లో బ్యాంకింగ్ సేవలాను ఉపయోగించవచ్చు. అయితే ఈ సెలవులు రాష్ట్రాలు, నగరాలను బట్టి సెలవులు మారుతూ ఉంటాయి. వాస్తవానికి, బ్యాంకింగ్ సెలవులు వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు లేదా ఆయా రాష్ట్రాల్లోని పండుగలపై ఆధారపడి ఉంటాయి.

ఈ వారం ఈ తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి
 మార్చి 17    హోలికా దహన్        డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ
మార్చి 18    హోలీ/ధూలేటి/డోల్ జాత్రా    బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, తిరువనంతపురం కాకుండా ఇతర ప్రదేశాలలో మూతపడనున్నాయి.
మార్చి 19    హోలీ/యఓసాంగ్    భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నా
మార్చి 20      ఆదివారం                            అన్నీ రాష్ట్రాలు

మార్చి నెలాఖరున సెలవుదినం 
హోలీ పండుగ తర్వాత వచ్చే వారం బ్యాంకులకు మూడు సెలవులు కూడా రానున్నాయి. వీటిలో, బీహార్ దివాస్ సందర్భంగా 22 మార్చి 2022న పాట్నాలో బ్యాంకులు మూసివేయబడతాయి. దీంతో పాటు మార్చి 26న నాలుగో శనివారం కావడంతో అన్ని చోట్లా బ్యాంకులకు సెలవు. ఆ తర్వాత మరుసటి రోజు ఆదివారం వీకెండ్ సెలవు కావడంతో బ్యాంకుల్లో కార్యకలపాలు ఉండవు. 

హోలీ రోజున స్టాక్ మార్కెట్ క్లోజ్
బ్యాంకులతో పాటు స్టాక్ మార్కెట్ సెలవులను పరిశీలిస్తే, 2022 లో మొత్తం 13 రోజుల పాటు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండదు. ఇందులో, మార్చి నెలలో రెండు సెలవులు షెడ్యూల్ చేయబడ్డాయి, మొదటిది మహాశివరాత్రి, ఇప్పుడు రెండవ సెలవుదినం మార్చి 18న హోలీ సందర్భంగా ఉంటుంది. 18 మార్చి 2022న కూడా ఎన్‌ఎస్‌ఈ, బి‌ఎస్‌ఈలో ట్రేడింగ్ ఉండదు.  
 

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే