పర్సనల్ లోన్ కోసం అప్లయ్ చేయాలని చుస్తున్నారా..? అయితే మీ క్రెడిట్ స్కోర్ ఎంతో తెలుసుకోండి..

By Ashok kumar Sandra  |  First Published Feb 19, 2024, 11:29 AM IST

క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి  క్రెడిట్ యోగ్యతకు సూచిక. ట్రాన్స్‌యూనియన్ CIBIL, హై మార్క్, ఈక్విఫాక్స్ అండ్  ఎక్స్‌పీరియన్ వంటి RBI-నమోదిత క్రెడిట్ బ్యూరోల ద్వారా క్రెడిట్ స్కోర్‌లు అందించబడతాయి. ఒక వ్యక్తి  CIBIL క్రెడిట్ స్కోర్ 300 నుండి 900 వరకు ఉంటుంది.


మెడికల్ లేదా మరేదైనా అవసరం కోసం లోన్ కావాలా..? సాధారణంగా డబ్బు అవసరానికి చాల మంది పర్సనల్ లోన్ పైనే ఆధారపడుతుంటారు. కానీ, మీరు దానిని పొందే ముందు అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలి. ఇతర విషయాలతోపాటు, వ్యక్తిగత రుణాలకు క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యమైనది. క్రెడిట్ స్కోర్ మీ పర్సనల్ లోన్ అర్హతను ఇంకా దానికి మీరు చెల్లించే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. కాబట్టి, క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి, పర్సనల్ లోన్‌లకు ఇది ఎంత ముఖ్యమైనది, దానిని ఎలా పెంచుకోవాలో  చూద్దాం.

క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?

Latest Videos

క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి  క్రెడిట్ యోగ్యతకు సూచిక. ట్రాన్స్‌యూనియన్ CIBIL, హై మార్క్, ఈక్విఫాక్స్ అండ్  ఎక్స్‌పీరియన్ వంటి RBI-నమోదిత క్రెడిట్ బ్యూరోల ద్వారా క్రెడిట్ స్కోర్‌లు అందించబడతాయి. ఒక వ్యక్తి  CIBIL క్రెడిట్ స్కోర్ 300 నుండి 900 వరకు ఉంటుంది.

క్రెడిట్ స్కోర్‌ని పెంచుకోవడం ఎలా?
 
సకాలంలో తిరిగి చెల్లింపు: కొనసాగుతున్న EMIలు, ప్రతినెల క్రెడిట్ కార్డ్ బిల్లులను ఎల్లప్పుడూ సకాలంలో చెల్లించండి. ఆ విధంగా మీరు సకాలంలో చెల్లించే బాధ్యతగల రుణగ్రహీత అని ఆర్థిక సంస్థలకు తెలుస్తుంది. అందువల్ల, సకాలంలో తిరిగి చెల్లించడం క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది.

లో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో: మీకు రూ. 1,00,000 క్రెడిట్ పరిమితితో క్రెడిట్ కార్డ్ ఉందని అనుకుందాం. అందులో 10,000 వినియోగించారు. అంటే మీ క్రెడిట్ వినియోగ రేషియో 10%. మంచి క్రెడిట్ స్కోర్ కోసం మీరు 30 శాతం లేదా అంతకంటే తక్కువ క్రెడిట్ వినియోగ రేషియో నిర్వహించాలి. క్రెడిట్ వినియోగ రేషియో తగ్గినప్పుడు, అది క్రెడిట్ స్కోర్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

మల్టి లోన్ దరఖాస్తులను నివారించండి: తక్కువ వ్యవధిలో ఎక్కువ లోన్లు లేదా క్రెడిట్ కార్డ్‌ల కోసం అప్లయ్ చేయడం మానుకోండి. ఇటువంటివి  క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది.

సెక్యూర్డ్ అండ్ అన్‌సెక్యూర్డ్ లోన్‌లు: మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటైన్ చేయడానికి  ఒకరికి సేఫ్  లోన్లు (హోమ్ లోన్, ఆటో లోన్, గోల్డ్ లోన్ లేదా ఏదైనా సెక్యూరిటీ సపోర్ట్ ఉన్న ఇతర లోన్లు) అండ్ అసురక్షిత లోన్  (క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్‌లు) మిక్స్ ఉండాలి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ని పెంచడంలో సహాయపడుతుంది.

click me!