DTH వద్దు.. ‘Fiber’ ముద్దు, డీటీహెచ్‌ను పీకేసి నెట్ కనెక్షన్ వైపు, భారతీయుల్లో ఎందుకీ మార్పు..?

By Siva Kodati  |  First Published Feb 17, 2024, 9:01 PM IST

లక్షలాది మంది భారతీయులు సాంప్రదాయక డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) సేవలకు స్వస్తి పలుకుతున్నారు. దీనికి బదులుగా ఫైబర్ కనెక్షన్లను వారి ప్రాథమిక వినోద వనరుగా ఎంచుకున్నారు. గత త్రైమాసికంలో 13.20 లక్షల మంది కస్టమర్‌లు తమ డీటీహెచ్ ప్రొవైడర్‌లతో సంబంధాలను తెంచుకున్నారు. 
 


లక్షలాది మంది భారతీయులు సాంప్రదాయక డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) సేవలకు స్వస్తి పలుకుతున్నారు. దీనికి బదులుగా ఫైబర్ కనెక్షన్లను వారి ప్రాథమిక వినోద వనరుగా ఎంచుకున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టీఆర్ఏఐ) విడుదల చేసిన ఇటీవలి డేటా .. డీటీహెచ్ సబ్‌స్క్రిప్షన్‌లలో నాటకీయంగా తగ్గుదలను ప్రస్తావించింది. గత త్రైమాసికంలో 13.20 లక్షల మంది కస్టమర్‌లు తమ డీటీహెచ్ ప్రొవైడర్‌లతో సంబంధాలను తెంచుకున్నారు. 

దీనికి బదులుగా ఫైబర్ కనెక్షన్ల వైపు వెళ్లడం భారతీయ జనాభా వినోద వినియోగ అలవాట్లతో తీవ్ర మార్పును సూచిస్తుంది. వాతావరణ పరిస్ధితులు , సాంకేతిక లోపాల వల్ల సర్వీస్ అంతరాయాలకు గురయ్యే అవకాశం వుందని విమర్శలు ఎదుర్కొన్న డీటీహెచ్ సేవల మాదిరిగా కాకుండా.. ఫైబర్ కనెక్షన్లు బలమైన , నమ్మదగిన ప్రత్యామ్నాయాన్ని అందించడమే దీనికి కారణం. ఈ కనెక్షన్‌లు నిరంతరాయ సేవకు హామీ ఇవ్వడమే కాకుండా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. వీటిని వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తుంది. 

Latest Videos

ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌లు , జియో సినిమా, జియోటీవీ వంటి ఫ్లాట్‌ఫాంల పెరుగుదల ఈ పరివర్తనలో కీలకపాత్ర పోషించింది. ఈ ఫ్లాట్‌ఫాంలు, ఫైబర్ కనెక్షన్‌ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయబడతాయి. లైవ్ స్పోర్ట్స్, తాజా సినిమాలు, వెబ్ సిరిస్‌లు , ప్రముఖ టీవీ షోలో సహా భారతీయ వీక్షకుల విభిన్న అభిరుచులకు అనుగుణంగా హెచ్‌డీ కంటెంట్‌ను అందిస్తున్నాయి. ఫైబర్ కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్, వినోద సేవలకు ఎలాంటి అంతరాయం కలగకపోవడంతో ప్రేక్షకులు ముఖ్యంగా యువత ఇటువైపే వచ్చారు. 

దేశవ్యాప్తంగా 2.23 కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికే ఫైబర్ కనెక్షన్ల వైపు మారారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి . సాంప్రదాయ డీటీహెచ్ సేవల కంటే ఇంటర్నెట్ ఆధారిత వినోద ఫ్లాట్‌ఫాంలకు పెరుగుతున్న ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది. ఈ మార్పు భారతదేశంలో వినోదాన్ని వినియోగించే విధానంలో గణనీయమైన పరివర్తనను సూచించడమే కాకుండా , భారతీయ కుటుంబాలకు ఒకప్పుడు ప్రధాన వినియోగ వనరుగా వున్న డీటీహెచ్ సేవల క్షీణతను కూడా సూచిస్తోంది.  డీటీహెచ్ సేవల కంటే ఫైబర్ కనెక్షన్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం భారతీయ వినోద దృశ్యం మారుతున్న పరిధులకు నిదర్శనం. ఫైబర్ .. రాజుగా కొత్త శకానికి నాంది పలికినట్లయ్యింది. 

click me!